Distributors met Minister: సినిమా టికెట్ల వ్యవహారంపై ప్రభుత్వం తరఫున ఓ కమిటీ వేశామని, ఆ కమిటీ ధరలను నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని, ఆ తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, రవాణా శాఖ పేర్ని వెంకట్రామయ్య (నాని) వెల్లడించారు. టికెట్ రేట్లపై డిస్ట్రిబ్యూటర్లు ప్రతిపాదనలు ఇచ్చారని, వీటిని కమిటీకి పంపుతామని చెప్పారు. మంత్రి నానితో డిస్ట్రిబ్యూటర్లు నేడు సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. లోయర్ క్లాస్ లో టికెట్ ధర 50 రూపాయలు ఉండాలని డిస్ట్రిబ్యూటర్లు కోరారని, టికెట్ రేట్లు ఎలా ఉండాలో వారు కొన్ని ప్రతిపాదనలను చేశారని వీటిని కమిటీకి పంపుతామన్నారు. సామాన్యుడికి ఇబ్బంది లేకుండా ధరలు ఎలా ఉండాలో కమిటీ తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు.
గత సెప్టెంబర్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమైనప్పుడే థియేటర్లకు ఫైర్ సేఫ్టీ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలని చెప్పామని, డిసెంబర్ వరకూ గడువు ఇచ్చామని, అలా చేసుకొని థియేటర్లను సీజ్ చేస్తున్నామన్నారు. థియేటర్లో సినిమా ప్రదర్శించాలంటే బి ఫాం తప్పకుండా ఉండాలని, అదికూడా లేకుండా కొంతమంది థియేటర్లు నడుపుతున్నారని అందుకే చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వానికి ఎవరిమీదో కక్ష ఉండాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.
హీరో నాని కిరాణా కొట్టు వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ… అయన ఏ కిరాణా కొట్టు లెక్కలు చూసి చెప్పారో తనకు తెలియదన్నారు. హీరో సిద్దార్థ్ ఎక్కడ ఉంటారని మంత్రి ప్రశ్నించారు. బహుశా అయన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రుల గురించి వ్యాఖ్యలు చేసి ఉంటారని నాని ఎద్దేవా చేశారు.
Also Read : సరైన నిర్ణయం తీసుకోవాలి : నారాయణ మూర్తి