Once Change to BJP: రాష్ట్రంలో ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే సుపరిపాలన అంటే ఏమిటో చూపిస్తామని బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవ్దేకర్ అన్నారు. టిడిపి, వైసీపీలు రెండూ కుటుంబ పార్టీలేనని, రెండు పార్టీల హయాంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. బిజెపి ఆంధ్ర ప్రదేశ్ అధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ప్రజాఆగ్రహ సభలో జవదేకర్ పాల్గొని ప్రసంగించారు. గతంలో మోడీ వల్లే టిడిపి అధికారంలోకి వచ్చిందని, కానీ చంద్రబాబు మోడీని దూషించి అధికారం కోల్పోయారని అయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొందరు నేతలు బెయిల్ ఫై ఉన్నారని వారు త్వరలోనే మళ్ళీ జైలుకు వెళ్ళే పరిస్థితులున్నాయని అయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
ప్రజాష్ జవదేకర్ ప్రసంగంలో ముఖ్యంశాలు:
- పోలవరం ప్రాజెక్టుకు నా హయాంలోనే అనుమతులు మంజూరు చేశాను
- అనుమతులిచ్చి ఏడేళ్ళు అవుతున్నా ఇంతవరకూ పోలవరం పూర్తి చేయలేకపోయారు
- ఇటీవలే పుష్ప సినిమా వచ్చింది, దానిలో ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి చూపించారు
- ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోంది
- స్మగ్లింగ్ నివారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఈ ప్రభుత్వం తొలగించింది
- ఏపీలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి, దీన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తోంది
- రామతీర్థం, అంతర్వేదిలో జరిగిన ఘటనలు దురదృష్టకరం
- జగనన్న కాలనీలన్నీ మోడీ కలనీలే
- ఏపీలో దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి
- ఏపీలో ఇలాంటి పాలన ఊహించలేదు
- జాతీయ స్థాయిలో నిర్మాణాత్మక పాలన జరుగుతుంటే రాష్ట్రంలో విధ్వంసక పాలన సాగుతోంది.
Also Read : బాబు కనుసన్నల్లో బిజెపి సభ : పేర్ని