Now its Jinnah Tower issue: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మరో వివాదాస్పద అంశాన్ని లేవనెత్తింది. గుంటూరులోని జిన్నా టవర్ సెంటర్ పేరును వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తోంది. బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ ఈ అంశాన్ని తొలుత ట్విట్టర్ ద్వారా ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం జిన్నా టవర్ సెంటర్ పేరును వెంటనే మార్చాలని కోరారు. టవర్ ఫోటోను షేర్ చేస్తూ ‘ఇది ఏ పాకిస్తాన్ లో ఉన్నదో కాదు, మన గుంటూరులోనో ఉంది, దేశ ద్రోహి జిన్నా పేరును ఇంకా మనం మోయాల్సిన అవసరం ఉందా’ అంటూ ప్రశ్నించారు. ‘జిన్నా పేరు బదులు అబ్దుల్ కలాం పేరుగానీ, దళిత కవి గుర్రం జాషువా పేరుగానీ ఎందుకు పెట్టకూడద’ని అడిగారు.
సత్య కుమార్ ట్వీట్ చేయగానే వరుసబెట్టి బిజెపి నేతలు ఈ అంశంపై స్పదించడం మొదలుపెట్టారు. తెలంగాణకు చెందిన బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే ఈ పేరు మార్చాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిన్నా టవర్ ను అబ్దుల్ కలాం టవర్ గా మార్చాలని సూచించారు. లేకపోతే బిజెపి కార్యకర్తలు ఈ టవర్ కూల్చాలంటూ పిలుపు ఇచ్చారు. దేశ విభజనకు జిన్నాయే కారణమని, జిన్నా టవర్ పేరు మార్చాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వంత పాడారు.
జిన్నా సెంటర్ పేరు మార్చకపోతే తామే కూలుస్తామని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. దేశ రాజధానిలో ఔరంగజేబు రోడ్డును అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చామని, అలాంటప్పుడు రాష్ట్ర రాజధానిలో మార్చలేమా అని ప్రశ్నించారు.
Also Read :టిడిపి నేతల వల్లే రాధాకు హాని: వెల్లంపల్లి