KL Rahul the Captain: తొడ కండరాల గాయం కారణంగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న టెస్ట్ సిరీస్ కు దూరమైన వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే సిరీస్ కూ అందుబాటులో ఉండడంలేదు. ప్రస్తుతం బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న రోహిత్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. అయితే పూర్తిగా గాయం నుంచి కోలుకోలేదు. జాతీయ జట్టు సెలెక్టర్లు రోహిత్ శర్మతో పలుసార్లు సంప్రదింపులు జరిపారు. ఈ స్థితిలో రోహిత్ శర్మను సౌతాఫ్రికా పంపడం సరికాదని, ప్రయోగాలకు సమయం కాదని అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ గా కెఎల్ రాహుల్ కు అవకాశం ఇచ్చారు. వైస్ కెప్టెన్ గా పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ను ఎంపిక చేశారు. గాయాలతో బాధపడుతున్న అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తో పాటు మహమ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చారు.
వన్డే జట్టు: కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, ధావన్, రుతురాజ్ గైక్వాడ్, సూర్య కుమార్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, చాహల్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, భువనేశ్వర్. దీపక్ చాహర్, ప్రసిద్ధ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్.
ఇండియా-సౌతాఫ్రికా మధ్య నిన్న ముగిసిన మొదటి టెస్ట్ లో ఇండియా113 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో టెస్ట్ సోమవారం జనవరి 3 నుంచి మొదలుకానుంది.
మూడు వన్డేల సిరీస్ జనవరి 19న ప్రారంభం కానుంది. 19, 21, 23 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి.