32వ విజయవాడ పుస్తక మహోత్సవం నేడు ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్ భవన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నుంచి 11వ తేదీ వరకూ ఈ ఉత్సవం జరగనుంది.
ఈ ఉత్సవంలో దాదాపు 200 మంది పబ్లిషర్స్ ప్రచురించిన తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లోని మూడు లక్షల పుస్తకాలు పాఠకులకు అందుబాటులో ఉండడం ముదావహమని గవర్నర్ పేర్కొన్నారు. విద్యార్ధులు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ప్రజలందరూ ఈ ఉత్సవాన్ని ఉపయోగించుకోవాలని పిలుపు ఇచ్చారు.