2020-21లో జరగాల్సిన జనగణన త్వరలో జరిగే అవకాశం లేదని కేంద్రం పేర్కొంది. జూన్ 2022 వరకు జిల్లాలు, ఇతర సివిల్, పోలీసు యూనిట్ల సరిహద్దులను మార్చవద్దని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. దేశంలో అతిపెద్ద గణన వ్యాయామానికి మూడు నెలల ముందు ఈ నియంత్రణ తప్పనిసరి అని తెలిపింది. మూడోవేవ్ విస్తరిస్తున్నందున జనాభా గణనను ఎప్పుడు నిర్వహించాలి? భారతీయ జనాభా రిజిస్టర్ ఎప్పుడు అప్డేట్ చేయాలనే దానిపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హెూం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్స పోలీసు యూనిట్ల సరిహద్దులు జూన్ 2022 వరకు స్తంభింపజేయబడినందున, అక్టోబర్ లోపు జనాభా గణన కార్యకలాపాలను ప్రారంభించే ప్రశ్నే లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. జనవరి 1, 2020 నుండి మార్చి 31, 2021 వరకు అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ల సరిహద్దులను స్తంభింపజేయాలని కేంద్ర ప్రభుత్వం మొదట ఆదేశించింది. తదనంతరం, మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత, అది డిసెంబర్ 31, 2020 వరకు పొడిగించబడింది. ఇప్పుడు జూన్ 30, 2022 వరక పొడిగించ బడింది. 2011లో దేశంలోని మొత్తం జిల్లాల సంఖ్య, చివరిసారిగా జనాభా గణన నిర్వహించ బడినప్పుడు, దాదాపు 640 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో దాదాపు 100 జిల్లాలు పెరిగినట్టు సమాచారం. చట్టబద్ధ మైన పట్టణాల సంఖ్య 4,657గా ఉంది. అయితే 2011లో 6,40,934గా ఉన్న గ్రామాల సంఖ్య ఇప్పుడు 6,39,083కి పడిపోయింది.