Destructive Rule: ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన జగన్ ప్రభుత్వ విద్యంస పాలన కొనసాగుతూనే ఉందని ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రజావేదికను కూల్చివేసి రెండేళ్ళు దాటినా ఇప్పటికీ అక్కడి శిథిలాలు తొలగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ అనుభవంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదని వ్యాఖ్యానించారు. ఈ పాలనతో రాష్ట్రానికి జరగబోయే నష్టాన్ని అందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతిని కూడా నాశనం చేశారని, దాన్ని అభివృద్ధి చేసి ఉంటే ఆర్ధికంగా ఇంత దుస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. అమరావతిలో భవనాలన్నీ నిరుపయోగంగా మారిపోయాయన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడిన ముఖ్యాంశాలు:
⦿ అమరావతి, పోలవరం రెండు కళ్ళ లాంటివి, రెంటినీ నాశనం చేశారు
⦿ ఏపీని అప్పుల కుప్పగా మార్చారు. సంక్షేమం కోసం అప్పులు చేస్తున్నామంటున్నారు.
⦿ ఎంత ఇచ్చారో.. ఎంత అప్పు తెచ్చారో ప్రభుత్వం చెప్పాలి.
⦿ ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
⦿ అప్పుల్లో ఏపీనే టాప్. సీఎంకు ఆదాయం రావాలి.. ప్రజలకు అప్పులు మిగలాలి.. ఇదే సీఎం జగన్ తీరు
⦿ ఓ వైపు విధ్వంసం.. మరో వైపు అప్పులు. పేదల పైనే చివరకు అప్పుల భారం పడనుంది.
⦿ సీఎం ఓ ప్రొఫెషనల్ లయర్. అన్ని అసత్యాలు.. ఫేక్ ఫిగర్సే.
⦿ కాగ్ కు.. కేంద్రానికి కూడా తప్పుడు లెక్కలు చెప్పారు.
⦿ వివేకా హత్యను గుండెపోటుగా చిత్రకరించే ప్రయత్నం చేశారు.
⦿ వివేకా కూతురు మీదే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు.
⦿ వివేకా హత్య కేసు, ఈడీ, సీబీఐ కేసుల నుంచి తప్పించుకునేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు.
⦿ ప్రత్యేక హోదా.. విభజన సమస్యలపై ఎంపీలంతా రాజీనామా చేద్దామంటే వైసీపీ మాట్లాడ్డం లేదు.
⦿ సీపీఎస్ రద్దు అంటే.. తెలియక హామీ ఇచ్చేశామంటున్నారు.
⦿ దేశానికి అన్నం పెట్టిన ఎపీలోనే వారి వేయవడ్డంతున్నారు
⦿ వైసీపీ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
⦿ రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది
⦿ ప్రజలు, మీడియా వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారు
⦿ రాష్ట్రంలో ప్రాజెక్టులు తేవడం విధ్వంసం చేసినంత సులువు కాదు
⦿ మా హయాంలో రాష్ట్రంలో 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంవోయూ చేసుకున్నాం
⦿ ఆ పెట్టుబడులు వస్తే 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి
⦿ జగన్ పాలనతో రాష్ట్రం పూర్తిగా నిర్వీర్యమైపోయింది
⦿ రాష్ట్ర భవిష్యత్తు పై ప్రజలు, మేధావులు ఆలోచించాలి
Also Read : ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసంపై దుమారం