Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్వెస్టిండీస్ చీఫ్ సెలెక్టర్ గా డెస్మండ్ హేన్స్

వెస్టిండీస్ చీఫ్ సెలెక్టర్ గా డెస్మండ్ హేన్స్

Desmond Haynes :వెస్టిండీస్ క్రికెట్  జట్టు  చీఫ్ సెలెక్టర్ గా లెజెండరి ఆటగాడు, వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఒకప్పటి ఓపెనర్ డెస్మండ్ హేన్స్ నియమితులయ్యారు. నేడు జరిగిన క్రికెట్ వెస్టిండీస్ (సి డబ్ల్యూ ఐ) బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  యూనివర్సిటీ అఫ్ వెస్టిండీస్ ఇటీవలే హేన్స్ ను గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. పార్లమెంట్ అఫ్ బార్బడోస్ గా కూడా అయన పనిచేశారు.

వెస్టిండీస్ క్రికెట్ కు మరోసారి సేవ చేసే అవకాశం కల్పించిన అధ్యక్షుడు స్కెరిట్ తో పాటు బోర్డు అఫ్ డైరెక్టర్స్ కు డెస్మండ్ హేన్స్ కృతజ్ఞతలు తెలియజేశారు. క్రికెట్ లో చీఫ్ సెలెక్టర్ పదవి ఎంతో క్లిష్టతరమైందని, అయినా తన శక్తి వంచన లేకుండా దేశ క్రికెట్ కు పూర్వ వైభవం తీసుకురావడానికి…. నిష్పాక్షికంగా, ప్రొఫెషనల్ గా తన బాధ్యతను నేరవేర్చేదుకు కృషి చేస్తానని హామీ ఇచ్చాడు.

రెండున్నరేళ్ళపాటు (2024 జూన్ 30 వరకు) హేన్స్ ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఒక వరల్డ్ కప్ (2023);  రెండు టి 20 వరల్డ్ కప్ లు (2022, 2024); వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్-2023 మెగా టోర్నీలకు జట్టును ఎంపిక చేయాల్సిన గురుతర బాధ్యత డెస్మండ్ హేన్స్ బృందంపై ఉంది.

Also Rate : యాషెస్ నాలుగో టెస్ట్ : ఆసీస్ 416/8 డిక్లేర్డ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్