PRC Confirmed: ప్రభుత్వ ఉద్యోగులకు 23.39 శాతం ఫిట్మెంట్ ను ఖరారు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల నుంచే పెంచిన జీతాలు అందిస్తామని చెప్పారు. ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ నెల నుంచే పీఆర్సీ అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్ అందిస్తామని చెప్పారు. రిటైర్ మెంట్ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. జూన్ 30 లోగా సీపీఎస్ పై నిర్ణయం తీసుకుంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
అధికారుల కమిటీ 14.29 శాతం ఇవ్వాలని సూచించింది
ఉద్యోగులకు మంచి చేయాలనే 9 శాతం పెంచి ఇస్తున్నాం
జూలై 1 2018 నుండి PRC అమలు
జనవరి 1 2022 నుంచి పెంచిన జీతాలు అందిస్తాం
పెండింగ్ డీఏలు జనవరి జీతంతో కలిపి ఒకేసారి చెల్లిస్తాం
ఈ ఏడాది జూలై నుంచి రెగ్యులర్ పేస్కేల్
ఉద్యోగుల బకాయిలన్నీ ఏప్రిల్‌కల్లా క్లియర్ చేస్తామని హామీ
జూన్ 30 లోగా కారుణ్య నియామకాలు
ఎంప్లాయీస్ హెల్త్ స్కీం సమస్యల పరిష్కరానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో లో కమిటీ
23 శాతం ఫిట్ మెంట్ తో 10,247 కోట్ల రూపాయల భారం
ప్రభుత్వం నిర్మించే జగనన్న కాలనీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు 10% శాతం రిజర్వ్
జూన్ 30లోగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులందరికీ ప్రొబేషన్ కన్‌ఫర్మేషన్
సవరించిన విధంగా న్యూ పేస్కేల్ తో ఈ ఏడాది జులై జీతం నుంచి ఇవ్వాలని ఆదేశాలు
ఉద్యోగులకు మేలు చేసే విషయంలో మనసుతో, గుండెతో స్పందించే ఈ నిర్ణయాలు ప్రకటిస్తున్నానని సిఎం జగన్ వ్యాఖ్యానించారు. దేవుడి ఆశీస్సులు, ప్రజలందరి చల్లని దీవెనలతో ప్రభుత్వం మంచి పాలన అందించటంలో ఉద్యోగుల సహాయ సహకారాలు మరింత మెరుగ్గా ఉంటాయని సిఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.