Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ నేటి మ్యాచ్ లలో పునేరి పల్టాన్, యూపీ యోధ జట్లు తమ ప్రత్యర్ధులపై విజయం సాధించాయి
పునేరి పల్టాన్- బెంగాల్ వారియర్స్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో 39-27 తో ఢిల్లీ విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో పూణే 20-11 తో ఆధిక్యం సంపాదించింది. రెండో అర్ధభాగంలో బెంగాల్ మెరుగ్గా ఆడినప్పటికీ పూణే జోరును ఆపలేక పోయింది, రెండో భాగంలోనూ పూణే 19-16తో పైచేయి కొనసాగించింది. మ్యాచ్ ముగిసే నాటికి 12 పాయింట్ల తేడాతో పల్టాన్ గెలుపొందింది. పూణే రైడర్ అస్లామ్ ఇమాందార్ 17 పాయింట్లు సాధించాడు.
యూపీ యోధ- బెంగూళూరు బుల్స్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో యూపీ ఘనవిజయం సాధించింది. ఇటీవల వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న బెంగుళూరు జోరుకు యూపీ కళ్ళెం వేసి 42-27 తో ఘనవిజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 19-14తో ఆధిక్యం సంపాదించిన యూపీ రెండో అర్ధ భాగంలో అంతకు మించి అన్నట్లు ఆడి 23-13 పాయింట్లతో సత్తా చాటింది. మొత్తంగా 15 పాయింట్ల తేడాతో గెలుపొందింది. యూపీ ఆటగాడు శ్రీకాంత్ జాదవ్ 13 పాయింట్లు సాధించి విజయంలో కీలకపాత్ర పోషించాడు.
నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత దబాంగ్ ఢిల్లీ (31 పాయింట్లు); పాట్నా పైరేట్స్ (29); బెంగుళూరు బుల్స్ (28); యూ ముంబా(25); తమిళ్ తలైవాస్ (22); యూపీ యోధ (20) జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.
Also Read : ప్రొ కబడ్డీ: తెలుగు టైటాన్స్ కు మరో ఓటమి