Thursday, March 19, 2026
Homeసినిమాఅంచ‌నాలు పెంచిన బంగార్రాజు ట్రైల‌ర్

అంచ‌నాలు పెంచిన బంగార్రాజు ట్రైల‌ర్

Bangarraju: టాలీవుడ్ కింగ్ నాగార్జున, యువసామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన భారీ క్రేజీ మూవీ ‘బంగార్రాజు’. సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ పై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఉన్నాయి. దీనికి తోడు టీజ‌ర్ అండ్ సాంగ్స్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డం… ఈ సంక్రాంతికి వ‌స్తున్న ‘బంగార్రాజు’కి పోటీగా మ‌రో భారీ చిత్రం లేక‌పోవ‌డంతో ఏ రేంజ్ స‌క్స‌స్ సాధిస్తాడ‌నేది ఆస‌క్తిగా మారింది. అయితే… ఈ సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు.

‘చూపులతోనే ఊచకోత కోసేస్తాడు..’ అంటూ అమ్మాయిలతో సరసాలు ఆడే బంగార్రాజు పాత్రని పరిచయం చేయడంతో ట్రైలర్ ప్రారంభమైంది. కనిపించిన ప్రతీ అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ.. బంగార్రాజు బుద్దులతో ఊడి పడిన మనవడు చిన బంగార్రాజుగా నాగచైతన్య కనిపించారు. తనకన్నా తెలివైన చదువుకున్న అమ్మాయి లేరని భావించే నాగలక్షిగా కృతిశెట్టి అలరించింది. అయితే… తనకన్నా తింగరిది తెలివి తక్కువ.. మందబుద్ది దద్దమ్మ ఈ ఊర్లోనే లేదంటూ నాగలక్షిని టీజ్ చేస్తున్న చిన బంగార్రాజు.. చివరకు ఆమెతోనే ప్రేమలో పడ్డాడు.

అయితే.. ఈసారి తన మనవడికి వచ్చిన సమస్య పరిష్కారం కోసం బంగార్రాజు భూమ్మీదకు వచ్చినట్లు ట్రైలర్ ను బ‌ట్టి తెలుస్తోంది. ఇందులో రమ్యకృష్ణ కూడా ఆత్మగా కనిపించింది. తన ఫ్యామిలీకి సమస్యను ఎదుర్కోడానికి చిన బంగార్రాజు వెనుక బంగార్రాజు ఒక శక్తిగా ఎలా ముందుకు నడిపాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో యాక్షన్ కు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నాగార్జున ఎప్పటిలాగే పంచెకట్టులో ఆకట్టుకోగా.. నాగచైతన్య మోడ్రన్ దసరా బుల్లోడిగా కలర్ ఫుల్ డ్రెస్సుల్లో స్టైలీష్ లుక్ లో ఆకర్షించారు. ఈ ట్రైల‌ర్ యూట్యూబ్ లో 7 మిలియ‌న్ వ్యూస్ తో దూసుకెళుతూ స‌రికొత్త‌ రికార్డులు సృష్టిస్తుంది. మ‌రి.. థియేట‌ర్లో బంగార్రాజు సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read : బంగార్రాజు పండ‌గ లాంటి సినిమా… ఆద‌రించండి : నాగార్జున

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular