Wednesday, April 17, 2024
HomeTrending Newsగోవా ఎన్నికల్లో పార్టీల ఎన్నికల వరాలు

గోవా ఎన్నికల్లో పార్టీల ఎన్నికల వరాలు

Goa Elections  : గోవా ఎన్నికలు ఈ దఫా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్, బిజెపి లను తోసిరాజని అమ్ ఆద్మీ పార్టీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల బరిలో దూసుకుపోతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఆప్ ను గెలిపిస్తే అన్ని మతాల వారిని ఆయా సంప్రదాయాల ప్రకారం పుణ్యక్షేత్రాలకు ఉచితంగా తీసుకెళ్తామని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ ఎన్నికల హామీ ఇదివరకే ప్రకటించారు. హిందువులను అయోధ్యకు, ముస్లీంలను షిరిడీకి లేదా అజ్మీర్ కు, క్రైస్తవులను తమిళనాడు లోని వెల్లంకిని దర్శనానికి తీసుకెళ్తామని ప్రకటించారు.

తాజాగా తృణముల్ కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసి టిఎంసి అధికారంలోకి వస్తే ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ లో శాశ్వత నివాస హక్కు ప్రజలకు కల్పిస్తామని ప్రకటించింది. 1976 కు ముందు నుంచి ఉన్నవాళ్ళకు ఇది వర్తిస్తుందని, రాష్ట్రంలో ఇల్లు లేని వారికి తమ ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇస్తుందని తృణముల్ కాంగ్రెస్ ప్రకటించటం గోవాలో హాట్ టాపిక్ గా మారింది.

మహారాష్ట్ర గోమంతక్ పార్టీ పొత్తు పెట్టుకొని గోవా బరిలో దిగిన తృణముల్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. పార్టీ ఎంపి మౌ మైత్ర గోవా ఎన్నికల ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల బిజెపి, కాంగ్రెస్ ల నుంచి నేతలు టిఎంసి లో చేరటం పార్టీ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రముఖ  టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్, బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సందీప్ వజర్కర్ తదితరులు టిఎంసి లో చేరారు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతుంటే పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మనోహర్ పరికార్ చనిపోయాక బిజెపి కి సరైన నాయకత్వం కరువైంది. కాంగ్రెస్ నాయకులు పొత్తుకు ప్రయత్నిస్తున్నా టిఎంసి పార్టీ నుంచి స్పందన రాలేదు. ఫిబ్రవరి 14వ తేదిన జరిగే గోవా ఎన్నికల్లో పార్టీల భవితవ్యం తేలనుంది.

Also Read : యుపి ఎన్నికలకు దూరంగా మాయావతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్