Friday, March 29, 2024
HomeTrending Newsయుపి ఎన్నికలకు దూరంగా మాయావతి

యుపి ఎన్నికలకు దూరంగా మాయావతి

Mayawati Stays Away From Up Elections : 

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి మౌనంగా ఉండిపోవడంపై కొన్నాళ్ళుగా  పలు ఊహాగానాలు  వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ మాయావతి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పార్టీ ఎంపీ సతీశ్ చంద్ర మిశ్రా మంగళవారం  ప్రకటించారు. ఈ దఫా శాసనసభకు పోటీ చేయనని అఖిలేష్ యాదవ్ ఇప్పటికే ప్రకటించారు. సిఎం యోగి కూడా పోటీ చేయబోరనే వార్త రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అగ్రనేతలు ఎన్నికల బరికి దూరంగా ఉంటారనే అంశం, ఏంటి వీరి ఎత్తుగడ అనే విషయాలు ఓటరు మహాశయులకు అంతుచిక్కటం  లేదు

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే అధికార బీజేపీతో పాటు విపక్ష సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్, ఇతర పక్షాలు కూడా ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్న నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి మౌనంగా ఉండిపోతున్నారు. దీంతో  దళిత ఓటు బ్యాంకు ఎటువైపు మళ్లుతుందనే దానిపైనా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో మాయావతి అసలు అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయడం లేదని పార్టీ ప్రకటించడం సంచలనం రేపుతోంది.

మాయావతితో పాటు తాను కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు బీఎస్పీ ఎంపీ సతీశ్ చంద్ర మిశ్రా  వెల్లడించారు. అదే సమయంలో ఎస్పీ, బీజేపీలపై ఆయన సైటెర్లు వేశారు. ఎస్పీకి పోటీ చేయడానికి 400 మంది అభ్యర్ఝులే లేనప్పుడు వారు 400 సీట్లు ఎలా గెలుస్తారని మిశ్రా ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చే సత్తా ఎస్పీ, బీజేపీ ఇద్దరికీ లేదన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీఎస్పీ మాత్రమేనని ఆయన  స్పష్టం చేశారు. ఏనుగు అంబారి అఖిలేష్ కు అవకాశం ఇస్తుందో , లోపాయికారిగా కమలానికి సహకరిస్తుందో బీఎస్పీ రాజకీయమేంటో ఎవరికీ అర్ధం కావడం లేదు.

Also Read : కేరళ సెక్స్ రాకెట్ లో అరెస్టుల పర్వం

RELATED ARTICLES

Most Popular

న్యూస్