Saturday, November 23, 2024
HomeTrending Newsహిందూ వ్యతిరేకుల ప్రభుత్వం - వీర్రాజు

హిందూ వ్యతిరేకుల ప్రభుత్వం – వీర్రాజు

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చాక హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు విమర్శించారు. అన్యమతస్తుల ప్రమేయంతో హిందూ వ్యవస్థ పై చేస్తున్న దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాజమండ్రి జిల్లా కార్యాలయంలో ఈ రోజు హిందూ సంప్రదాయ భోగి మంటను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలను పిడకల రూపేణా భోగి మంటలో వేసి దగ్దం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ఆత్మకూరులో ఒక మతానికి చెందిన అక్రమ కట్టడాన్ని ప్రోత్సాహించడం, ఆంతర్వేది రధం దగ్ధం, రామతీర్థంలో రాముని శిరచ్ఛేదనము చేయడం , విజయవాడలో దుర్గ గుడిలో సింహ విగ్రహాలు మాయం చేసిన ఘటనలో ఇంతవరకూ ఎవరిని అరెస్టు చేయ లేదని మండిపడ్డారు. నిందితులను శిక్షించడం జరగక పోవడం హిందువుల పట్ల ప్రభుత్వ ఉదాసీనత వైఖరికి నిదర్శనమన్నారు. ఈ అంశాలపై ప్రభుత్వ చర్యలు కోరుతూ భోగి మంటల్లో పిడకలు వేయడం జరిగింది అని ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను విడనాడాలని వీర్రాజు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్ రేలంగి శ్రీదేవి. దానికి సెల్ కన్వీనర్ సత్య గోపీనాథ్ దాస్. రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు కాస్త ఓబిసి మోర్చా ప్రధాన కార్యదర్శి రొంగల గోపి శ్రీనివాస్ లలిత జెన్ . కురుగంటిసతీష్ అడబాల రామకృష్ణ . యానాపుఏసు.చింతాలమ్మ. డాక్టర్ అనురాధ. సుబ్బారావు. కాశీ. తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్