Friday, November 22, 2024
Homeతెలంగాణరేషన్ పంపిణీ చేయలేదు : కిషన్ రెడ్డి

రేషన్ పంపిణీ చేయలేదు : కిషన్ రెడ్డి

కరోనా విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం మంచిది కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఉచిత రేషన్ ను కేంద్రం విడుదల చేసినప్పటికీ తెలంగాణా ప్రభుత్వం లబ్ధిదారులకు ఇంకా వాటిని పంపిణీ చేయలేదని ఆరోపించారు. బ్లాక్ ఫంగస్ నివారణకు కావాల్సిన మందులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపామని వెల్లడించారు.

నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి జాతీయ నాయకత్వం పిలుపు మేరకు రాష్ట్ర పార్టీ నేతలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సికింద్రాబాద్ పద్మారావునగర్ లో రక్తదాన శిబిరం…  లాలాపేట లో కరోనా బాధితులకు, వికలాంగులకు, జిహెచ్ ఎంసి  కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.  ముఖ్య అతిథిగా పాల్గొన్న కిషన్ రెడ్డి ప్రపంచలోని అనేక దేశాలతో పోలిస్తే ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు, తక్కువగా ఉన్నప్పటికీ కరోనా ఎదుర్కోవడంలో మిగిలిన దేశాలకు ఆదర్శంగా నిలిచామని, మోడీ సమర్ధ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైదని కిషన్ రెడ్డి అన్నారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని అన్నారు.

మోడీ ఏడేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో బిజెపి అధ్వర్యంలో వారం రోజులపాటు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్