బ్రిటన్ ప్రధాని బొరిక్ జాన్సన్ తన ప్రియురాలు కారీ సైమండ్స్ ను రహస్యంగా వివాహమాడారు. వెస్ట్ మినిస్టర్ క్యాతెడ్రల్ చర్చ్ లో ఈ తంతు జరిగింది. అయితే దీనిపై వివరాలు వెల్లడించేందుకు బొరిక్ కార్యాలయం నిరాకరించింది.
కేవలం అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. అతిథులకు కూడా కొద్ది గంటల ముందే సమాచారం ఇచ్చి ఆహ్వానం పంపారు. బొరిక్ జాన్సన్ కార్యాలయంలోని కొద్దిమంది సీనియర్ సిబ్బందికి కూడా ఈ పెళ్లిపై ఎలాంటి సమాచారం లేకపోవడం విశేషం. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో కేవలం 30 మందితో మాత్రమే వివాహ వేడుక నిర్వహించుకోవాలనే నిబంధన అమల్లో ఉంది. అందుకే పెళ్ళికి సంబంధించిన సమాచారం బయటకు లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు
56 సంవత్సరాల జాన్సన్ 33 ఏళ్ళ సైమండ్స్ తో గత కొద్దికాలంగా సహజీవనం చేస్తున్నారు. 2019 లో జాన్సన్ ప్రధానిగా ఎన్నికైనప్పటినుంచీ డోయింగ్ స్ట్రీట్ లో ఆయనతో కలిసే ఉంటున్నారు. తాము ఎంగేజ్మెంట్ చేసుకున్నామని, త్వరలోనే ఓ బిడ్డ పుట్టబోతున్నాడని గత ఏడాడి మొదట్లో ఇరువురూ ప్రకటించారు. 2020 ఏప్రిల్ లో వారికి ఒక బాబు జన్మించారు. విల్ఫ్రెడ్ లారీ నికోలస్ జాన్సన్ గా పేరుపెట్టుకున్నారు. 2022 జులైలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ హఠాత్తుగా పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. జాన్సన్ కు ఇది మూడో పెళ్లి కావడం విశేషం.