Wednesday, November 27, 2024
HomeTrending Newsపంజాబ్ పోలింగ్ వాయిదా

పంజాబ్ పోలింగ్ వాయిదా

Punjab Polling Postponed :

పంజాబ్  శాసనసభ ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. షెడ్యుల్ ప్రకారం వచ్చే నెల 14వ తేదిన ఎన్నికల పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా ఫిబ్రవరి 20వ తేదికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. గురు రవిదాస్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రజలు వేడుకలు చేసుకోవటంతో పాటు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో సిక్కు దళితులు పుణ్య స్నానాల కోసం వారణాసి వెళతారు. గురు రవిదాస్ జయంతి వచ్చే నెల 16వ తేదిన ఉండగా మూడు రోజుల ముందటి నుంచే భక్తులు వారణాసి ప్రయాణంలో ఉంటారు.

ఈ నేపథ్యంలో పంజాబ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ తేది వాయిదా వేయాలని కాంగ్రెస్, బిజెపి సహా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. ఈ రోజు అత్యవసరంగా సమావేశమైన జాతీయ ఎన్నికల సంఘం వచ్చే నెల 20 వ తేది నాడు పోలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి ఒకటో తేది గడువు కాగా ఫిబ్రవరి రెండో తేది నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేది అని ఎన్నికల సంఘం తాజాగా పేర్కొంది. ఎన్నికల ఫలితాలు ఇదివరకు ప్రకటించినట్టుగానే మార్చి పదవ తేదిన వెలువడతాయి.

Also Read : పంజాబ్ లో రాబోయేది ఆప్ ప్రభుత్వమే

RELATED ARTICLES

Most Popular

న్యూస్