KTR Appealed Center Government To Support The Hand Loom Of Ts :
రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఆదుకోవాలని ఏడేళ్ళుగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా ఉలుకూ పలుకూ లేదని రాష్ట ఐటి, పరిశ్రమలు, పురపాలక, చేనేత శాఖల మంత్రి కేటిఆర్ విమర్శించారు. ఇప్పటివరకూ మోడీ ప్రభుతం ఏడు బడ్జెట్లు ప్రవేశ పెడితే, ప్రతిసారీ తాము ప్రతిపాదనలు చేసినా, తెలంగాణా రాష్ట్ర చేనేత రంగానికి ఒక్క రాయితీ కూడా కేంద్రం ఇవ్వలేదని అయన ఆవేదన వ్యఖ్తం చేశారు. సిరిసిల్లలో అయన మీడియాతో మాట్లాడారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ తమ విజ్ఞప్తులు కేంద్రం ఆమోదించేలా చూడాలని సూచించారు. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా మరోసారి ఈ ప్రతిపాదననలు కేంద్రం ముందు పెడుతున్నామని చెప్పారు. ఈ లేఖ ప్రతులను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయెల్, బండి సంజయ్ లకు కూడా పంపుతున్నట్లు కేటియార్ వివరించారు.
కేటియార్ కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు :
కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు 897.92 కోట్ల రూపాయలు మంజూరు చేయాలి
పోచంపల్లి కేంద్రంగా తెలంగాణాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు చేయాలి
రాష్ట్రంలో చేనేత, మరమగ్గాల ఆధునీకరణకు కలిసిరావాలి. రాష్ట్ర, కేంద్రం చెరో యాభై శాతం భరించేలా తోడ్పాటు ఇవ్వాలి
రాష్ట్రంలో 11 చేనేత క్లస్టర్లు మంజూరు చేయాలి
రాష్ట్రంలో జాతీయ స్థాయి టెక్స్ టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలి
రూ. 50 కోట్లతో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలి
Also Read : నాలుగు ఆర్వోబీలకు నిధుల విడుదల