IPL in India: ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీని ను మార్చి 27 నుంచే ప్రారంభించాలని బిసిసిఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులోనూ స్వదేశంలోనే నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఐపీఎల్ 15 వ సీజన్ ను ఈ ఏడాది ఏప్రిల్ 2 నుంచి జూన్ 3వ తేదీ వరకూ నిర్వహించాలని షెడ్యూల్ ఖరారు చేశారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఆటగాళ్ళ వేలం జరగనుంది. అయితే నేడు ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లతో జరిగిన సమావేశంలో షెడ్యూల్ మార్పుపై కూడా చర్చలు జరిగినట్లు తెలిసింది.
మరోవైపు, కోవిడ్ మూడో దశ… ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఈ సీజన్ ఇండియాలోనే ఉంటుందా లేక విదేశాల్లో నిర్వహిస్తారా అనే అనుమానాలకు కూడా బిసిసిఐ తెరదించింది. ఈ సీజన్ మ్యాచ్ లన్నీ మహారాష్ట్రలోనే నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈసారికి ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ లు నిర్వహించాలని, ముంబై లోని వాంఖేడే స్టేడియం, డివై పాటిల్ స్టేడియం వేదికలుగా టోర్నీ జరుగుతుందని, అవసరాన్ని బట్టి పూణే లో కూడా కొన్ని మ్యాచ్ లు జరుగుతాయని బిసిసిఐ అధికారి ఒకరు వెల్లడించారు.
Also Read :ఐపీఎల్ కు స్టార్ ఆటగాళ్ళ డుమ్మా