Sunday, February 23, 2025
Homeసినిమాఓటీటీలో ‘అఖండ’ స‌రికొత్త రికార్డ్

ఓటీటీలో ‘అఖండ’ స‌రికొత్త రికార్డ్

Here also: బాల‌య్య న‌టించిన ‘అఖండ’ డిస్నీ+హాట్‌స్టార్ లో విడుద‌లైంది. ఓటీటీలో రిలీజైన 24 గంటల్లోనే అత్యధిక వీక్షకుల సంఖ్యతో పాటుగా అత్య‌ధిక‌ వీక్షణ సమయాన్ని అఖండ నమోదు చేసింది. ఈ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్ పై మొట్టమొదటిసారిగా ఇంతటి భారీ విజయం నమోదు చేసిన తొలి తెలుగు చిత్రంగా స‌రికొత్త రికార్డ్ సృష్టించింది. డిస్నీ+హాట్‌స్టార్‌ వీక్షకులు ‘అఖండ’ చిత్రంలో నందమూరి బాలకృష్ణ లుక్‌ పట్ల విపరీతమైన అభిమానం చూపడంతో పాటుగా అతని శక్తివంతమైన క్యారెక్టర్‌తో మమేకమయ్యారు.

బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ‘అఖండ’ చిత్రంలో నందమూరి బాలకృష్ణ , ఓ వినూత్నమైన అఘోర పాత్రలో నటించారు. పరమశివుని వరప్రసాదంగా , మైనింగ్‌ మాఫియా ఉచ్చులో పడిన గ్రామ రక్షకునిగా కనిపించారు. ఈ చిత్రంలో  జగపతిబాబు, శ్రీకాంత్‌ , ప్రగ్యజైశ్వాల్‌ , షామ్నా ఖాసీం, విజ్జి చంద్రశేఖర్‌, సుబ్బరాజు ముఖ్య పాత్రలలో కనిపించారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్‌ ఎస్‌ థమన్‌. ఈ చిత్రంలోని పాటలతో పాటుగా నేపథ్య సంగీతం కూడా ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.

డిస్నీ+హాట్‌స్టార్‌ కంటెంట్‌ హెడ్‌, డిస్నీ స్టార్‌ ఇండియా  ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌ హెచ్‌ఎస్‌ఎం గౌరవ్‌ బెనర్జీ మాట్లాడుతూ… ‘అఖండ చిత్రానికి వచ్చిన స్పందన పట్ల మేము పూర్తి సంతోషంగా ఉన్నాం. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడినప్పటికీ డిస్నీ+హాట్‌స్టార్ పై సైతం రికార్డులు సృష్టించింది. ఈ చిత్రాన్ని డిస్నీ+హాట్‌స్టార్ పై స్ట్రీమింగ్‌ చేయడం ఆరంభించిన మరుక్షణమే వీక్షించడానికి రికార్డు సంఖ్యలో ప్రేక్షకులు సిద్ధమయ్యారు. ఈ స్ట్రీమింగ్‌ ప్రీమియర్‌కు వీక్షకుల నిరీక్షణ, ప్రతిస్పందన  అపూర్వమైనది’’ అని అన్నారు.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “నాకు ఎల్లప్పుడూ అండగా ఉండే నా ప్రేక్షకులకు నేను ధన్యవాదములు చెబుతున్నాను. నేను చేసే ప్రతి చిత్రంలోనూ విభిన్నంగా చేయడానికి ప్రయత్నిస్తుంటాను. పరమశివుని అనుగ్రహం వల్ల  బాక్సా ఫీస్‌ వద్ద 50 రోజులు అఖండ ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌ వద్ద రికార్డులను సృష్టిస్తూ ఓపెనింగ్‌లూ వచ్చాయి. ఇది నాకెంతో సంతోషంగా ఉంది. ఈ వేదిక ద్వారా మరింత మంది సినీ అభిమానులు ఎక్కడ నుంచైనా ఈ చిత్రాన్ని వీక్షించగలగడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్