Bangarraju: తండ్రీకొడుకులు కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ ‘బంగార్రాజు’. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ క్రేజీ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో బంగార్రాజు సక్సస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక బంగార్రాజు 10 రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే….
నైజాం – 7.92 కోట్లు, సీడెడ్ – 6.30 కోట్లు, ఉత్తరాంధ్ర – 4.73 కోట్లు, ఈస్ట్ – 3.81 కోట్లు, వెస్ట్ – 2.70 కోట్లు, గుంటూరు – 3.21 కోట్లు, కృష్ణా – 2.08 కోట్లు, నెల్లూరు – 1.64 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 32.39 షేర్, 52.47 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. కర్ణాటక, ఆర్ఓఐ – 1.68 కోట్లు, ఓవర్ సీస్ – 1.42 కోట్లు మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 35.49 కోట్లు షేర్, 59.50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో జనాలు థియేటర్లకు రావడానికి ఆలోచిస్తున్న పరిస్థితుల్లో బంగార్రాజు సినిమా 60 కోట్ల గ్రాస్ రాబట్టడం విశేషం.
Also Read : ఆయనే నిజమైన ‘బంగార్రాజు’ : నాగార్జున