AAP: పంజాబ్ ఎన్నికల్లో ఈసారి తమ సత్తా చాటాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉవ్విళ్ళూరుతోంది. 2017 ఎన్నికల్లో 20 సీట్లు సాధించిన ఆప్ ఈసారి అధికార పీఠంపై కన్నేసింది. భగవంత్ మాన్ ను ఆ పార్టీ సిఎం అభ్యర్ధిగా ప్రకటించి బరిలోకి దిగింది. ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతు ఆందోళనలకు తమ పార్టీ నైతికంగా ఇచ్చిన మద్దతు, పంజాబ్ లో అధికార కాంగ్రెస్ పై వ్యతిరేకత, బిజెపికి ఆశించిన స్థాయిలో నేతలు లేకపోవడం, విపక్ష శిరోమణి అకాలీదళ్ పార్టీ ప్రజా మద్దతు కూడగట్టుకోవడంలో వైఫల్యం….. లాంటి అంశాలు తమకు కలిసి వస్తాయని ఆప్ ధృడంగా విస్తాసిస్తోంది.
కాగా, ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పంజాబ్ లో రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. జనవరి 28న ఆ రాష్ట్రానికి చేరుకొని 29, 30 తేదీల్లో పలు నియోజకవర్గాల్లో ఓట్లు అభ్యర్ధించనున్నారు. కీలకమైన జలంధర్, అమృత్ సర్ నియోజకవర్గాల్లో కూడా కేజ్రీ పర్యటన సాగనుంది.
ఫిబ్రవరి 20న రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేరోజు పోలింగ్ జరగనుంది. మార్చి 10 న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ జరుగుతోంది.
అధికార కాంగ్రెస్ పార్టీ;
విపక్ష శిరోమణి అకాలీదళ్-బీఎస్పీ;
కాంగ్రెస్ నుంచి విడిపోయి వేరు కుంపటి పెట్టుకున్న అమరేందర్ సింగ్-బిజెపి- శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్)కూటమి;
ఆమ్ ఆద్మీ పార్టీ… పోటీలో ఉన్నాయి
Also Read : పంజాబ్ లో రాబోయేది ఆప్ ప్రభుత్వమే