Good Luck: కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గుడ్ లక్ సఖి. స్పోర్ట్స్ రొమ్-కామ్ గా రూపొందిన ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మహిళా టెక్నీషియన్స్ తో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాని తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందించారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి ఈ చిత్రాన్ని నిర్మించారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జనవరి 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పార్క్ హయత్ లో `గుడ్ లక్ సఖి` ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ముఖ్య అతిధిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ వేడుకలో చిత్రంలో సందర్భానుసారంగా వచ్చే ‘ఎగిరే తిరంగ జెండాల తల ఎత్తి దించకుండా..’ పాటను రామ్ చరణ్ ఆవిష్కరించారు. బిగ్ టిక్కెట్‌నూ విడుదల చేశారు.
ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ.. నేను అతిథిగా రాలేదు. నాన్నగారి దూతగా వచ్చాను. ఆయన ఆశీస్సులు తెలియపర్చడానికి వచ్చాను. యంగ్ నిర్మాతలు శ్రావ్య, సుధీర్ ఈ స్థాయికి చేరడం మామూలు విషయం కాదు. యంగ్ టెక్నికల్ టీమ్ పని చేశారు. నగేష్ నేషనల్ అవార్డు విన్నర్. కెమెరామెన్, కీర్తి ఇలా ఇంతమంది కలిసి పని చేయడం మామూలు విషయం కాదు. అందుకే వీరి కలయిలో సినిమా బాగుంటుంది. నా కాలేజీ డేస్‌లో నగేష్ గారి సినిమా చూశాను. మనం ఇప్పుడు ఓటీటీ చూసి ఎంజాయ్ చేస్తున్నామో నగేష్ గారు ఎప్పుడో అది ఓపెన్ చేశారు.
ఇక్బాల్, హైదరాబాద్ బ్లూస్ వంటి సినిమాలు అందుకు నిదర్శనాలు. ఇక ఇంత మంది దిగ్గజాలు వుండగా చిన్న సినిమా కాదు. చాలా మీనింగ్ ఫుల్ సినిమా అని నాకు అనిపిస్తుంది. అందరికీ లైట్‌హౌస్‌గా దేవీశ్రీప్రసాద్ వున్నారు. రంగస్థలం, ఎవడు సినిమాలకు పని చేశారు. సినిమా పరిశ్రమలో ఆడవాళ్ళు, మగవాళ్ళు అనే తేడాలేదు. ఇప్పుడు ఏ బోర్డర్ లేకుండా ఇండియన్ సినిమా అని రాజమౌళి వల్ల పేరు తెచ్చుకుంది. ఇండియన్ సినిమాలో ఆడ, మగ కలిసి పని చేస్తున్నారు.
అందరూ ఒక్కటే. ఆది పినిశెట్టి రంగస్థలంలో మా అన్నగా చేశారు. అయన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ‘మహానటి’లో కీర్తి తపన నచ్చింది. అలా నేషనల్ అవార్డు దక్కించకోవడం గ్రేట్. ఇలాంటి కథలు మీరే చెప్పాలి. ఈనెల 28న సోలో రిలీజ్ దొరకడం మంచి విజయం చేకూరుతుందని భావిస్తున్నా. కీర్తి అభిమానులతోపాటు మా అభిమానులు కూడా సినిమా చూడండి’ అని పిలుపు ఇచ్చారు. అనంతరం ఆర్.ఆర్.ఆర్.లోని ‘నాటునాటు..’ సాంగ్‌ను కీర్తితో రామ్ చరణ్ కలిసి డ్యాన్స్ చేసి అలరించారు.
Also Read : జనవరి 28న కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’