Saturday, November 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్పాకిస్తాన్ నుంచి ప్రశాంత్ విడుదల

పాకిస్తాన్ నుంచి ప్రశాంత్ విడుదల

పాకిస్తాన్ లో చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ కు ఎట్టకేలకు విముక్తి లభించింది. వాఘా సరిహద్దుల వద్ద పాకిస్తాన్ రేంజర్లు ప్రశాంత్ ను బి.ఎస్.ఎఫ్. బలగాలకు అప్పగించారు.

వైజాగ్ కు చెందిన ప్రశాంత్ మాదాపూర్ లోని  ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో పని చేస్తున్నాడు.  స్విట్జర్లాండ్ లో ఉన్న తన ప్రియురాలిని ఎతుక్కుంటూ 2017లో వీసా లేకుండానే గూగుల్ మ్యాప్ సాయంతో బయల్దేరాడు. మారమధ్యంలో పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో పోలీసులు ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా తమ భూభాగంలో చొరబడిన నేరం మోపి అతన్ని జైలులో ఉంచారు. తెలంగాణా, కేంద్ర ప్రభుత్వాల ద్వారా ప్రశాంత్ తల్లిదండ్రులు పాకిస్తాన్ కు అసలు విషయాన్ని తెలియజేశారు. అయినప్పటికీ విచారణ పేరుతో నాలుగేళ్ళు సాగదీసిన పాకిస్తాన్  చివరకు నేడు ప్రశాంత్ ను భారత  అధికారులకు అప్పగించారు.

సాయంత్రం ప్రశాంత్ హైదరాబాద్ చేరుకోనున్నాడు.  సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను ప్రశాంత్ తండ్రి బాబురావు కలుసుకున్నారు. తన కుమారుడి విడుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ బాబురావు ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్