Saturday, September 21, 2024
Homeస్పోర్ట్స్మొయిన్ విధ్వంసం: ఇంగ్లాండ్ విజయం

మొయిన్ విధ్వంసం: ఇంగ్లాండ్ విజయం

England Vs WI: ఇంగ్లాండ్- వెస్టిండీస్ మధ్య జరిగిన నాలుగో టి20లో ఇంగ్లాండ్ 34 పరుగులతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ కెప్టెన్ మొయిన్ అలీ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో రాణించి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కించుకున్నాడు. బార్బడోస్ , బ్రిడ్జిటౌన్ లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

ఎనిమిది పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి వికెట్(టామ్ బ్యాంటన్-4) కోల్పోయింది. రెండో వికెట్ కు జేసన్ రాయ్- జాన్ వీన్స్ లు 85 పరుగులు జోడించారు. జేసన్ రాయ్ 52 (42 బంతులు, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి ఔటయ్యాడు. ఆ కాసేపటికే వీన్స్(34) కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో కెప్టెన్ మొయిన్ అలీ తన ప్రతాపం చూపాడు. కేవలం 23 బంతుల్లో 7 సిక్సర్లు, ఒక ఫోర్ తో 63 పరుగులు చేశాడు. చివర్లో వికెట్ కీపర్ బిల్లింగ్స్ కూడా నాలుగు బంతుల్లో రెండు భారీ సిక్సర్లతో 13 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో హోల్డర్ మూడు; షెఫర్డ్, అకీల్ హోసేన్, పోలార్డ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

విండీస్ తొలి వికెట్ కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కేల్  మేయర్స్ 40 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ కాసేపటికే మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్ 26 పరుగులు చేసి మొయిన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్-22; జాసన్ హోల్డర్-36, చివర్లో కెప్టెన్ పోలార్డ్-18 పరుగులతో రాణించినప్పటికీ నిర్ణీత 20 ఓవర్లలో159 పరుగులు మాత్రమే చేయగలిగింది. మెయిన్ అలీ రెండు; రీస్ టోప్లే, అదిల్ రషీద్, లివింగ్ స్టోన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఐదు మ్యాచ్ ల సిరీస్ ప్రస్తుతం 2-2 తో సమం అయ్యింది. ఆఖరి, సిరీస్ విజేతను నిర్ణయించే మ్యాచ్ నేటి సాయంత్రం (భారత కాలమానం ప్రకారం రేపు తెల్లవారుజామున) జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్