Friday, November 22, 2024
HomeTrending Newsసిబిఎస్ ఈ పరీక్షలు రద్దు

సిబిఎస్ ఈ పరీక్షలు రద్దు

సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణపై  ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.  కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రదాన్, ప్రకాష్ జవ దేకర్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ అనంతర ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన విద్యా శాఖా మంత్రి రమేష్ పోక్రియార్ ఈ సమావేశంలో పాల్గొనలేక పోయారు.

పరీక్షలపై వివిధ రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, వైద్య,విద్యారంగాలకు చెందిన నిపుణుల సూచనలు పొందుపరుస్తూ కేంద్ర విద్యాశాఖ అధికారులు ప్రధాని ముందు ప్రెజెంటేషన్ ఇచ్చారు. అన్ని విషయాలను ఆలకించిన  ప్రధాని పరీక్షల రద్దు నిర్ణయానికే మొగ్గు చూపారు.

పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యమే ముఖ్యమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. పరీక్షల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాల్సి ఉందని మోడీ అభిప్రాయపడ్డారు.  పరీక్షలు రాయాలనుకునే వారికి గత ఏడాది మాదిరిగానే కరోనా తగ్గిన తరువాత నిర్వహిస్తామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్