Dubai Expo : విదేశీ పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా దుబాయ్ ఎక్స్ పో లో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. దుబయ్ ఎక్స్ పో -2022 సన్నద్ధత ఏర్పాట్లపై పరిశ్రమల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దుబయ్ ఎక్స్ పో సన్నద్ధత ఏర్పాట్ల పట్ల పరిశ్రమల శాఖ కృషిని అభినందించిన మంత్రి ఇతర రాష్ట్రాల కన్నా ఏపీ ప్రత్యేకమని చాటే విధంగా ఇలాగే ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. ఫిబ్రవరి 11 నుంచి 17 మధ్య జరగనున్న ఎక్స్ పోకి హాజరవుతోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఫిబ్రవరి 8న మంత్రి మేకపాటి నేతృత్వంలోని పరిశ్రమల శాఖ అధికారుల బృందం దుబాయ్ పయనం అవుతోంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సమీక్షకు హాజరైన పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది, జాయింట్ డైరెక్టర్లు ఇందిరా, వీఆర్ వీఆర్ నాయక్, ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్ బాబు, తదితరులు
దుబయ్ ఎక్స్ పోలోని ఇండియా పెవిలియన్ లో 11 నుంచి 17 తేదీల వరకూ ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ నిర్వహణ ఉంటుంది. 13 నుంచి 17 తేదీల మధ్య కీలక కార్యక్రమాలకు పరిశ్రమల శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. 13వ తేదీన 100 మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాల(తెలుగు డయాస్పర) నిర్వహణకు కార్యాచరణ. ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్లాన్. 14న పారిశ్రామికవేత్తలతో సీఎక్స్ వో రౌండ్ టేబుల్ సమావేశం, రోడ్ షో నిర్వహణ. సాయంత్రం 250 మందికి పైగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో మంత్రి నేతృత్వంలో సమావేశం ఉంటుంది.
15వ తేదీన ప్రపంచ స్థాయి సకల సదుపాయాలతో కూడిన డీపీ వల్డ్ ఫెసిలిటీ సైట్ విజిట్, వివిధ ఎమిరేట్ కంపెనీలతో బీ2జీ మీటింగ్. 16న పెట్టుబడుల కోసం వివిధ కంపెనీలతో మంత్రి సమావేశం నిర్వహిస్తారు. భారత రాయబారి సహకారంతో ప్రత్యేక సమావేశానికి పరిశ్రమల శాఖ ప్లాన్ సిద్దం చేసింది. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల వాతావరణం, ప్రత్యేకతలు, సానుకూల అంశాలతో పెవిలియన్ ఏవీ(ఆడియో విజువల్)ల రూపకల్పనపట్ల ఏపీ ప్రత్యేక శ్రద్ధ
పలు ఆహార, సరకు రవాణా కంపెనీలు ఇప్పటికే ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నాయి. పెవిలియన్ లో ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులు, ఫిషింగ్ హార్బర్లు, విద్య, వైద్యం, పర్యాటకం, ఐ.టీ, పోర్టులు సహా పలు రంగాలపై ఏపీ ప్రత్యేకతను చాటేందుకు పరిశ్రమల శాఖ కసరత్తు. దుబయ్ లో ఆయిల్ ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యత నేపథ్యంలో కెమికల్, పెట్రో కెమికల్ స్క్రీన్ లకు మరింత ప్రాధాన్యత.
Also Read : ఉద్యోగులకు మంచి చేశాం: సిఎం జగన్