Monday, November 11, 2024
Homeస్పోర్ట్స్బెంగుళూరు జట్టుకు పివి సింధు తండ్రి సలహాలు

బెంగుళూరు జట్టుకు పివి సింధు తండ్రి సలహాలు

Bengaluru Torpedoes: పివి రమణ లాంటి సీనియర్ ఆటగాడి సూచనలు సలహాలు తమకెంతో ఉపకరిస్తాయని బెంగుళూరు టోర్పెడోస్ కెప్టెన్ రంజిత్ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రైమ్ వాలీబాల్ లీగ్ 2022 ఎడిషన్ రేపు ఫిబ్రవరి 5న మొదలుకానుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో స్పెషల్ క్యాంప్ లో ఉన్న బెంగుళూరు జట్టును భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, ఆమె తండ్రి పివి రమణ కలుసుకున్నారు. వాలీబాల్ క్రీడాకారుడైన రమణ జాతీయ జట్టుకు ఆడారు, 1986 ఆసియన్ గేమ్స్ లో స్వర్ణపతకం సాధించిన భారత వాలీబాల్ జట్టులో రమణ కూడా ఉన్నారు. బెంగుళూరు ఆటగాళ్లకు రమణ ఆటపై పలు కీలక సూచనలు, అమూల్యమైన సలహాలు అందించారు.

టోర్నమెంట్ కు ముందు రమణ లాంటి ఓ గొప్ప, సీనియర్ ఆటగాడు తన అనుభవంతో అందించిన మెళకువలు ఎంతగానో ఉపకరిస్తాయని… బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు దేశానికి గర్వకారణమని, ఆమెను కలుసుకోడానికి ఆటగాళ్ళు ఎంతో ఉత్సాహం ప్రదర్శించారని, ఆమె నుంచి స్ఫూర్తి, ఉత్తేజం పొందారని, ఆమెతో ముఖాముఖి మాట్లాడడం తమ ఆటగాళ్లకు జీవితాంతం గుర్తుండిపోతుందని రంజిత్ చెప్పాడు. ఒలింపిక్స్ లో  ఆడటమే గొప్ప విషయమని, అలాంటిది దేశానికి రెండు సార్లు పతకాలు అందించడం విశేషమని పేర్కొన్నాడు.

సెట్టర్, అప్పోనెంట్ బ్లాకర్, అటాకర్ ఎలా ఉండాలి, ప్రత్యర్థి ఆట తీరును ఏ విధంగా అంచనా వేయాలి, వారిని ఎలా డిఫెన్స్ లో పడేయాలి లాంటి అంశాల్లో రమణ అందించిన సలహాలు లీగ్ లో  తమకు ఎంతగానో ఉపయోగపడతాయని రంజిత్ వెల్లడించాడు.

Also Read : వాళ్ళిద్దరూ రంజీ ఆడొచ్చు : గంగూలీ సలహా

RELATED ARTICLES

Most Popular

మన భాష- 4

మన భాష- 3

మన భాష- 2

న్యూస్