Government Junior College: యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు నేటితరం దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. దీనికి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ అనే టైటిల్ ఫిక్స్ చేసి యువత నచ్చేలా ఆ వాస్తవ కథకు తెర రూపమిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరో వైపు ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారు మేకర్స్.
బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్ పై అన్ని హంగులు జోడించి రూపొందించిన ఈ సినిమాకు భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. శరవణ వాసుదేవన్ సంగీతం సమకూర్చారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. వంశీ ఉదయగిరి కో- డైరెక్టర్‌గా పని చేశారు. అన్ని వర్గాల ఆడియన్స్‌ని అలరించేలా ఈ సినిమా రూపొందించామని, ఈ సినిమాతో ప్రేక్షకులకు ఓ కొత్త ఫీల్ దొరుకుతుందని దర్శకనిర్మాతలు తెలిపారు.
ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ చిత్రంలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.
Also Read : సప్తగిరి హీరోగా నూతన చిత్రం ప్రారంభం