Ratha Saptami: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుతుతున్నాయి. అత్యంత పవిత్రమైన ఈరోజున సూర్యభవానుడి దర్శించుకుంటే ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. పెద్ద సంఖ్యంలో భక్తులు స్వామి దర్శనార్ధం వస్తున్నారు.
స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆరోగ్య ప్రదాత అయిన అదిత్యుడికి తొలిపూజ చేసుకునే భాగ్యం కలడడం, అయన దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాని కృష్ణ దాస్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు కలగాలని ప్రార్ధించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి రాష్ట్ర ప్రజలను ఆదుకునే శక్తి ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా స్వామిని దర్శించుకున్నారు.