Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఇండియా క్లీన్ స్వీప్

ఇండియా క్లీన్ స్వీప్

India Won 3rd ODI also: వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ను ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. నేడు జరిగిన మూడో మ్యాచ్ లో 96 పరుగులతో ఘన విజయం సాధించింది. శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ లు బ్యాటింగ్ లో రాణించగా, బౌలర్లు సమిష్టిగా రాణించి విండీస్ ను కట్టడి చేశారు.

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇండియా జట్టులో నాలుగు మార్పులు చేశారు. కెఎల్ రాహుల్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్  స్థానంలో  శిఖర్ ధావన్, కులదీప్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ చాహర్ జట్టులోకి వచ్చారు.

రోహిత్ శర్మతో పాటు ధావన్ ఓపెనర్ గా దిగాడు. 16  పరుగుల వద్ద ఇండియా రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ 13 పరుగులకే ఔట్ కాగా, కోహ్లీ డకౌట్ గా పెవిలియన్ చేరాడు. 26 బంతులాడిన ధావన్ కేవలం 10 పరుగులే చేసి మూడో వికెట్ గా వెనుదిరిగాడు. ఈ దశలో శ్రేయాస్-రిషభ్ పంత్ నాలుగో వికెట్ కు 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయ్యర్-80 (111 బంతులు, 9ఫోర్లు); పంత్-56 (54 బంతులు, 6ఫోర్లు, 1సిక్సర్) స్కోరు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్-33; దీపక్ చాహార్-38తో రాణించారు. నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. విండీస్ బౌలర్లలో హోల్డర్ నాలుగు; అల్జర్రి  జోసెఫ్, హెడెన్ వాల్ష్ చెరో రెండు; ఒడియన్ స్మిత్, ఫాబియన్ అల్లెన్ చెరో వికెట్ పడగొట్టారు.

India Won Match

విండీస్ 19 పరుగుల వద్ద షాయ్ హోప్ (5) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది. మంచి భాగస్వామ్యం నమోదు చేయడంలో విండీస్ విఫలమైంది. ఓడియన్ స్మిత్-36; నికోలస్ పూరన్-34; అల్జర్రి  జోసెఫ్-29 మాత్రమే ఫర్వాలేదనిపించారు. విండీస్ 37.1 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇండియా బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, సిరాజ్ చెరో మూడు; దీపక్ చాహర్, కులదీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

80 పరుగులతో రాణించిన శ్రేయాస్ అయ్యర్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించగా, ప్రసిద్ కృష్ణ కు ‘ ప్లేయర్ అఫ్ ద సిరీస్’ దక్కింది.

ఫిబ్రవరి 16న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఇండియా-వెస్టిండీస్ మధ్య మొదటి టి-20 మ్యాచ్ జరగనుంది.

Also Read : హాకీ: సౌతాఫ్రికాను చిత్తు చేసిన ఇండియా

RELATED ARTICLES

Most Popular

న్యూస్