Heavy Price: ఐపీఎల్ -2022 వేలంలో ఇండియా ఆటగాళ్ళు ఇషాన్ కిషన్, దీపక్ చాహర్ లకు మంచి ధర దక్కింది. ఇషాన్ కిషన్ ను ముంబై ఇండియన్స్ 15.25 కోట్ల రూపాయలకు తిరిగి దక్కించుకుంది. ఇదే కోవలో దీపక్ చాహర్ ను తమతోనే ఉంచుకోవడానికి చెన్నె 14 కోట్లు వెచ్చించింది. ఐపీఎల్ ఆరంభమైన మొదట్లో హాట్ ఫేవరేట్ ఆటగాడిగా ఉన్న సురేష్ రైనా కు ఈసారి వేలంలో నిరాశ మిగిలింది. రైనాను కోగుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. అలాగే ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవెన్ స్మిత్ పై కూడా ఎవరూ ఆసక్తి చూపలేదు. సాయంత్రం 5.45 నిమిషాలకు ఐపీఎల్ వేలం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
⦿ ఇషాన్ కిషన్ – రూ. 15.25 కోట్లు – ముంబై ఇండియన్స్
⦿ దీపక్ చాహర్ – రూ. 14 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
⦿ హర్షల్ పటేల్ – రూ. 10.75 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు
⦿ వానిండు హసరంగా – 10.75 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు
⦿ నికోలస్ పూరన్ – 10.75 కోట్లు – సన్ రైజర్స్ హైదరాబాద్
⦿ ప్రసిద్ కృష్ణ – 10 కోట్లు – రాజస్థాన్ రాయల్స్
⦿ హెట్ మేయిర్ – రూ. 8.50 కోట్లు – రాజస్థాన్ రాయల్స్
⦿ వాషింగ్టన్ సుందర్ – రూ. 8.75 కోట్లు – సన్ రైజర్స్ హైదరాబాద్
⦿ జాసన్ హోల్డర్ – రూ. 8.75 కోట్లు –లక్నో సూపర్ జెయింట్స్
⦿ క్రునాల్ పాండ్యా – రూ. 8.25 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
⦿ నితీష్ రానా – రూ. 8 కోట్లు – కోల్ కతా నైట్ రైడర్స్
⦿ దేవదత్ పదిక్కల్ – రూ. 7.75 కోట్లు – రాజస్థాన్ రాయల్స్
⦿ అంబటి రాయుడు – రూ. 6.75 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
⦿ మిచెల్ మార్ష్ – రూ. 6.50 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
⦿ దినేష్ కార్తీక్ – రూ. 5.50 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు
⦿ దీపక్ హుడా – రూ. 5.75 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
⦿ మనీష్ పాండే – రూ.4.50 కోట్లు –లక్నో సూపర్ జెయింట్స్
⦿ బ్రేవో – రూ. 4.40 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
⦿ టి. నటరాజన్ – రూ. 4కోట్ల – సన్ రైజర్స్ హైదరాబాద్
⦿ రాబిన్ ఊతప్ప – రూ. 2 కోట్లు –చెన్నై సూపర్ కింగ్స్
⦿ జేసన్ రాయ్ – రూ. 2 కోట్లు – గుజరాత్ టైటాన్స్
Also Read : ఐపీఎల్ వేలం: అయ్యర్ కు 12.5 కోట్లు