Saturday, November 23, 2024
Homeతెలంగాణబిసిలకు ఇవ్వాల్సిందే : విహెచ్ డిమాండ్

బిసిలకు ఇవ్వాల్సిందే : విహెచ్ డిమాండ్

బిసిలకు పిసిసి పదవి ఇవ్వాలని మాజీ ఎంపి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ మరోసారి డిమాండ్ చేశారు. ఒకవేళ రెడ్లకే ఇవ్వాలనుకుంటే పార్టీలో ఎప్పటినుంచో ఉంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇవ్వాలని సూచించారు. గాంధీ భవన్ లో విహెచ్ మీడియాతో మాట్లాడారు.

రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైతే తమ లాంటి నేతల పరిస్థితి ఏంటని విహెచ్ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో చిక్కుకున్న రేవంత్ జైలుకు వెళ్తే పార్టీకి దిక్కేమిటని నిలదీశారు, ఆయనకు చరిష్మా ఉంటే కోడంగల్ లో ఎందుకు ఓడిపోయారని, దుబ్బాక, జి.హెచ్.ఎం.సి., నాగార్జునసాగర్ లో ఎందుకు గెలిపించాలేకపోయారని విహెచ్ అడిగారు.

గాంధీ భవన్ లో తన లాంటి వారు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి పెత్తనం నడుస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అభిమానుల పేరుతో తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని, బూతులు తిట్టారని విహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను ఆ విధంగా దూషిస్తే కనీసం ఉత్తమ కుమార్ రెడ్డి గానీ, మల్లు భట్టి విక్రమార్క కానీ స్పందించలేదని వాపోయారు. జానా రెడ్డి ఒక్కరే ఆ సమయంలో మాట్లాడారని గుర్తు చేసుకున్నారు.

గతంలో వైఎస్ తో కూడా తాను పోరాటం చేశానని, కానీ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని విహెచ్ నిట్టూర్చారు. పిసిసి అధ్యక్ష పదవిపై మరోసారి సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకోవాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే పార్టీ నష్టపోక తప్పదని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్