Schools In Karnataka Reopen :
కర్ణాటకలో స్కూల్ మెనేజ్మెంట్ చెప్పిన ప్రకారం భుర్కా, హిజాబ్ తీసి స్కూల్ ఆవరణలోకి వెళుతున్న మహిళలు.. మాకు చదువే ముఖ్యం అంటూ చాలా మంది ముస్లిం మహిళలు,అమ్మాయిలు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.. ఇక హిందూ బాలికలు ,బాలురు కూడా కాషాయ వస్త్రాలు లేకుండానే స్కూల్ కి వస్తున్నారు.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో శాంతి వాతావరణం నెలకొంది…..కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని మత సంస్థల ఆరాటం తప్ప ప్రజలకు ఇవేమీ లేవు అనడానికి కర్ణాటకలో మారిన పరిస్థితులు తెలియజేస్తున్నాయి.
బెంగళూరుతో సహా రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో ఈ రోజు స్కూల్స్ ప్రారంభం అయ్యాయి. హైకోర్టు ఆదేశాలను అమలు చేయటం, విద్యాలయాల ప్రాంగణంలో ఆచరించేల చూడాల్సిన బాధ్యత విద్యాలయాల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్, విద్యార్థులు తల్లిదండ్రులదే బాధ్యతా అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హిజాబ్ గొడవలు సద్దుమణిగి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రేపటి నుంచి అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రారంభించాలని నిర్ణయించినట్టు కర్ణాటక విద్యాశాఖ మంత్రి చంద్రశేఖరయ్య నగేష్ వెల్లడించారు.
Also Read : బడ్జెట్ ఎందుకు దండగ? మతం ఉందిగా దండిగా!