భారత దేశానికి వ్యాక్సిన్ సరఫరాపై హామీ ఇచ్చిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. కమలా హారిస్ తో జరిపిన ఫోన్ చర్చల వివరాలను ప్రధాని మోడీ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గ్లోబల్ వ్యాక్సిన్ షేరింగ్ విధానంలో భాగంగా మనదేశానికి వ్యాక్సిన్లు పంపుతామని కమల చెప్పారన్నారు. అమెరికా ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి, సౌహార్ధ్రతకు ధన్యవాదాలు అని మోడీ పేర్కొన్నారు. భారత్- అమెరికాకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై కూడా చర్చించామని మోడీ తెలియజేశారు.
వ్యాక్సిన్ సహకారంతో పాటు, ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసుకోవడం, కోవిడ్ అనంతర పరిణామాల్లో వైద్య, వాణిజ్య రంగాల పునరుజ్జీవంలో రెండు దేశాలు సంయుక్తంగా ముందుకు వెళ్ళడం లాంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు మోడీ వివరించారు.
తొలి విడతలో రెండున్నర కోట్ల వ్యాక్సిన్ దోషులను అమెరికా భారత్ కు పంపనుంది. మన దేశంతో పాటు మరో మూడు దేశాలకు చెందిన అధ్యక్షులతో కూడా హారిస్ ఫోన్ సంభాషణ జరిపారు. ఈ నెలాఖరు నాటికి దాదాపు 8 కోట్ల వ్యాక్సిన్ లను ఇతర దేశాలకు సరఫరా చేయాలన్న ఆలోచనతో అమెరికా ఉంది.