ఉక్రెయిన్ – రష్యా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్నందున అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం భారత పౌరులను హెచ్చరించింది. అత్యవసరమైతే తప్పితే ఉక్రెయిన్ పర్యటన మానుకోవాలని, ఉక్రెయిన్ దేశంలో అంతర్గతంగా కూడా ప్రయాణాలు విరమించుకోవాలని, ముఖ్యంగా విద్యార్థులు రాయబార కార్యాలయంతో నిత్యం టచ్ లో ఉండాలని కోరింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని అస్పష్ట వాతావరణం రెండు దేశాల మధ్య ఆవరించి ఉందని భారత ఎంబసీ ఆందోళన వ్యక్తం చేసింది. భారత పౌరులు రాజధాని కీవ్ లోని రాయబార కార్యాలయంలో తమ పేర్లు, వివరాలు నమోదు చేసుకోవాలని, భారత్ నుంచి ఉక్రెయిన్ వచ్చే వారు తమ ప్రయాణాలు విరమించుకోవాలని భారత ఎంబసీ స్పష్టం చేసింది. గత నెల జనవరి 26వ తేది నుంచే క్యివ్ లోని బారత రాయబార కార్యాలయంలో భారత పౌరుల వివరాల నమోదు ప్రారంభం అయింది.
బుధవారం(ఫిబ్రవరి-16) తర్వాత ఏ క్షణంలోనైనా రష్యా దాడికి దిగే ప్రమాదం ఉందని అమెరికా పదే పదే హెచ్చరికలు జారీ చేస్తోంది. యూరోప్ ఉత్తర ప్రాంతంలో పట్టు సాధిస్తే రష్యాను కట్టడి చేయవచ్చనే అమెరికా ఆలోచన, ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇవ్వాలని అమెరికా వేసిన ఎత్తు వల్లే ఈ పరిస్టితి ఉత్పన్నం అయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ సంప్రదింపులు