Souls: త్రినాధ్ వర్మ, భావన సాగి హీరో, హీరోయిన్లు గా నటించిన చిత్రం సోల్స్. ఈ చిత్రం ద్వారా శ్రావణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మనకు ఎదురయ్యే ఏ పరిచయం కూడా యాదృచ్ఛికం కాదు అనే కథా నేపథ్యంతో రెండు సోల్స్ మధ్య జరిగే ప్రయాణమే ఈ సోల్స్ చిత్రం. ఈ చిత్రాన్ని సిక్కింలోని అరుదైన అందమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. పరమకృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ బ్యానర్ పై విజయలక్ష్మి వేలూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ ను ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ.. సోల్స్ మూవీ టీజర్ చూస్తుంటే.. సినిమా మ్యూజికల్ లవ్ స్టొరీలా బాగుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన త్రినాథ్ వర్మ, భావన సాగిలు చాలా బాగా నటించారు. సోల్స్ సినిమా సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
Also Read : మిస్ ఇండియా దర్శకుడితో నిర్మాత మధు కాలిపు కొత్త చిత్రం