CM paid tributes: దివంగత ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఎల్లుండి అయన స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రహ్మణపల్లిలో జరగనున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీ సమేతంగా గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. గన్నవరం నుంచి హైదరాబాద్ చేరుకున్న సిఎం జగన్ దంపతులు నేరుగా జూబ్లీహిల్ల్స్ లోని మంత్రి నివాసానికి చేరుకొని అయన భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. సిఎం ను చూడగానే మేకపాటి రాజమోహన్ రెడ్డి భావోద్భ్బావేగానికి గురయ్యారు. రాజమోహన్ రెడ్డి, అయన సతీమణిని సిఎం జగన్ ఓదార్చారు. సిఎం సతీమణి భారతి గౌతమ్ రెడ్డి భార్య, కూతురుని ఓదార్చారు. విదేశాల్లో చదువుకుంటున్న అయన కుమారుడు క్రిష్ణార్జున్ రెడ్డి రేపు సాయంత్రానికి అమెరికా నుంచి చెన్నై కు చేరుకొని అక్కడినుంచి నెల్లూరు కు వస్తారు.
కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం అంత్యక్రియల వివరాలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. రేపు ఉదయం భౌతిక కాయాన్ని నెల్లూరు లోని అయన స్వగృహానికి తరలిస్తామని, ఎల్లుండి ఉదయం బ్రాహ్మణ పల్లి కి తరలించి అక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లలో ఏర్పాట్లను మంత్రి అనిల్ కుమార్ పర్యవేక్షిస్తారని, హైదరాబాద్ లో అవసరమైన ఏర్పాట్లను మంత్రి సురేష్ చూస్తారని సజ్జల చెప్పారు. సిఎం జగన్ ఎల్లుండి బ్రాహ్మనపల్లిలో జరిగే అంత్యక్రియలకు హాజరవుతారని సజ్జల చెప్పారు.
Also Read : వివాద రహితుడు, సౌమ్యుడు.. గౌతమ్ రెడ్డి