Saturday, November 23, 2024
HomeTrending Newsజంగిల్ బ‌చావో- జంగిల్ బ‌డావో

జంగిల్ బ‌చావో- జంగిల్ బ‌డావో

Jungle Bachao Jungle badaavo : 

హ‌రితహారం కార్య‌క్ర‌మంలో భాగంగా అట‌వీ పునర్జీవ‌న కార్య‌ప్ర‌ణాళికను రూపొందించి, జంగిల్ బ‌చావో- జంగిల్ బ‌డావో నినాదంతో రిజ‌ర్వ్ ఫారెస్ట్ లో పెద్ద ఎత్తున మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కాంపా నిధుల‌తో అడ‌వుల‌ను ర‌క్షించ‌డం, అట‌వీని మెరుగుప‌ర‌చ‌డం, వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌, ప‌చ్చ‌ద‌నం పెంచ‌డం, జీవ‌వైవిధ్యాన్ని కాపాడ‌టం, కార్బన్ సీక్వెస్ట్రేషన్, భూమి క్షీణ‌త‌ను త‌ట‌స్థ‌త స్థితికి తీసుకురావ‌డం, నీటి ల‌భ్య‌త‌, త‌దిత‌ర వాటిని మెరుగుపరచడానికి అట‌వీ కార్యాక‌ల‌పాలు చేప‌ట్ట‌డం జ‌రిగిందన్నారు. శుక్రకవారం అటవీ, పర్యావరణంపై జాతీయ స్థాయి వర్క్ షాప్ జరిగింది. హైదరాబాద్ బేగంపేటలోని ఓహోటల్ లో జరిగిన ఈ వర్క్ షాప్ ను పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంపొందించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కల పెంపకం, వాటి సంరక్షణకు అధిక ప్రాధన్యతనిస్తున్నారని అన్నారు. అడ‌వుల పెంప‌కం, ప‌చ్చ‌ద‌నం విస్తీర్ణాన్ని 24% నుంచి 33% పెంచేందుకు తెలంగాణ‌కు హ‌రిత‌హారం అనే మహోత్తర కార్యక్ర‌మానికి 2015 లో సీయం కేసీఆర్ శ్రీకారం చుట్టారు.అటవీ ప్రాంతం వెలుపల 130 కోట్లు, అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలను నాటడం ల‌క్ష్యంగా పెట్టుకున్నాము.

దూరదృష్టి, రాజ‌కీయం సంక‌ల్పంతో వీటి అమలు, పర్యవేక్షణ కోసం బలమైన సంస్థాగత ఏర్పాటు ఇప్పటికే చేయ‌డం జ‌రిగింది. అట‌వీ విస్తీర్ణం, ప‌చ్చ‌ద‌న పెరుగుద‌ల ప‌రంగా సానుకూల ఫ‌లితాలు వ‌స్తున్నాయి. 2021 నివేదిక ప్ర‌కారం అటవీ విస్తీర్ణం, ప‌చ్చ‌ద‌నం, అట‌వీ ప్రాంతంలో కార్బన్ నిల్వల పెరుగుదలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండ‌వ స్థానంలో నిలిచింది. విలువైన అట‌వీ భూములు, అట‌వీ సంప‌ద‌ను కాపాడ‌టంతో పాటు న‌గ‌ర ప‌ట్ట‌ణ వాసులకు అర్బ‌న్ లంగ్ స్పేస్ క‌ల్పించాల‌నే ఉద్దేశ్యంతో రాష్ట్రం వ్యాప్తంగా 109 అర్బ‌న్ ఫారెస్ట్ పార్కుల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 53 పార్కుల అభివృద్ధి ప‌నులు పూర్తి చేశామన్నారు.

పర్యావరణ పరిరక్షణలో బాధ్యతాయుతమైన భాగస్వామ్యంలో భాగంగా ఎంతో దూర‌దృష్టితో “హరిత నిధి” ని ఏర్పాటు చేశామన్నారు. హరితహారంను విజయవంతంగా నిర్వహిస్తుండటంతో పాటు, ఇందులో అందరినీ భాగస్వాములను చేసేందుకు హరిత నిధిని ఏర్పాటు చేయాలని గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో పాటు ప్రైవేట్ సంస్థ‌లు, ప్ర‌జాప్ర‌తినిదులు, విద్యార్థులను హరితనిధిలో భాగస్వామ్యం చేశారు. హ‌రిత నిధి ద్వారా వ‌చ్చే నిధుల‌ను అడ‌వుల పెంప‌కం, అట‌వీ పున‌ర్జీవ‌నం కోసం వినియోగించాల‌ని నిర్ణ‌యించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎస్ సోమేష్ కుమార్, కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ డీజీ, ప్రత్యేక కార్య‌ద‌ర్శి చంద్ర ప్ర‌కాష్ గోయ‌ల్, అద‌న‌పు డీజీ, జాతీయ కాంపా సీఈవో సుభాష్ చంద్ర‌, రాష్ట్ర అట‌వీ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్యాద‌ర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్. శోభ‌, పీసీసీఎఫ్ (కాంపా సీఈవో) లోకేష్ జైస్వాల్, పీసీసీఎఫ్ (సోష‌ల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. డోబ్రియ‌ల్, ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన పీసీసీఎఫ్ లు, అధికారులు పాల్గొన్నారు.

Also Read : అభయారణ్యాల్లో అండ‌ర్ పాస్ లు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్