Saturday, September 21, 2024
Homeస్పోర్ట్స్ప్రొ. కబడ్డీ విజేత దబాంగ్ ఢిల్లీ

ప్రొ. కబడ్డీ విజేత దబాంగ్ ఢిల్లీ

Delhi, The Winner:  దబాంగ్ ఢిల్లీ జట్టు 2021 వివో ప్రో కబడ్డీ లీగ్ – ఎమినిదో సీజన్ విజేతగా నిలిచింది. ఆట ప్రథమార్థంలో ఇరు జట్లూ హోరాహోరీ తలపడ్డాయి. అయితే రెండు ఆలౌట్ పాయింట్లు సాధించిన పాట్నా అదే రెండు పాయింట్లతో (17-15) పైచేయి సాధించింది. ద్వితీయార్ధంలో కూడా రెండు జట్లూ నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. చివరి ఐదు నిమిషాల్లో పాట్నా అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 22-19తో ఢిల్లీ పైచేయి సాధించి, మొత్తంగా ఒక పాయింట్ తేడాతో టైటిల్ చేజిక్కించుకుంది. ఢిల్లీ ఆల్ రౌండర్ నవీన్ కుమార్ 14; నవీన్ 10 పాయింట్లు సాధించి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. పాట్నా రైడర్లు సచిన్ 10; గమన్ సింగ్ 9 పాయింట్లు సాధించారు.

జనవరి 18,  ఫిబ్రవరి 17న ఈ రెండు జట్ల మధ్య జరిగిన లీగ్ పోటీల్లో కూడా ఢిల్లీ దే పైచేయి కావడం గమనార్హం. చివరకు ఫైనల్లో కూడా ఢిల్లీ పాట్నాను ఓడించి తమ సత్తా చాటింది.

ఈ సీజన్ ముఖ్యాంశాలు:

  • ఢిల్లీ తానూ ఆడిన 22 మ్యాచ్ లలో 12 గెలవగా, 6 ఓటమి పాలైంది. మరో 4 టై అయ్యాయి.
  • పాట్నాలీగ్ దశలో ఆడిన 22 మ్యాచ్ ల్లో 16 గెలిచి 5 ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ టై అయ్యింది.
  • మొదటి రెండు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్ లతో సంబంధం లేకుండా ఈ రెండు జట్లూ సెమీ ఫైనల్ చేరుకున్నాయి
  • ప్లే ఆఫ్ మ్యాచ్ లలో పూణేపై యూపీ, గుజరాత్ పై బెంగుళూరు విజయం సాధించి సెమీ ఫైనల్స్ కు చేరుకున్నాయి.
  • సెమీ ఫైనల్లో యూపీపై పాట్నా; బెంగుళూరుపై ఢిల్లీ విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టాయి
  • ఈ సీజన్ లో బెంగుళూరు కెప్టెన్ పవన్ షెరావత్ తన ఆట తీరుతో కబడ్డీ ప్రేక్షకులను అలరించాడు, 244 విజయవంతమైన రైడ్స్ చేసిన ఆటగాడిగా, 304 రైడ్ పాయింట్లు సంపాదించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. తాను ఆడిన 24 మ్యాచ్ లలో 18 సార్లు పది, ఆపైన పాయింట్లు సంపాదించి, మొత్తంగా 320 పాయింట్లు సంపాదించి మరో ఘనత సాధించాడు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్