India Vs. SL: మొహాలీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇండియా భారీ స్కోరు చేసింది. రవీంద్ర జడేజా మరోసారి తన బ్యాట్ తో సత్తా చాటి 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీ విరామ సమయంలో 8 వికెట్లకు 574 పరుగుల వద్ద ఇండియా తన ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.
ఆరు వికెట్లకు 357 పరుగుల వద్ద నేటి రెండోరోజు ఆట ఇండియా మొదలు పెట్టింది. రవిచంద్రన్ అశ్విన్ – జడేజాలు ఏడో వికెట్ కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అశ్విన్ 61 పరుగులు చేసి ఔటయ్యాడు. 160 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన జడేజా ఆ తర్వాత చెలరేగి ఆడాడు. 228 బంతుల్లో 17ఫోర్లు, 3 సిక్సర్లతో 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. జయంత్ యాదవ్ కేవలం 2 పరుగులే చేసి అవుట్ కాగా, మహమ్మద్ షమీ 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు. లంక బౌలర్లలో లక్మల్, విశ్వ ఫెర్నాండో, ఎంబుల్దేనినా తలా రెండు; ధనుంజయ డిసిల్వా, లాహిరు కుమారా చెరో వికెట్ సాధించారు.
మొదటి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన శ్రీలంక మొదటి వికెట్ కు 48 పరుగులు చేసింది. లాహిరు 17 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీ అయ్యాడు. ఆ కాసేపటికే కెప్టెన్ కరునరత్నే(28 ) జడేజా బౌలింగ్ లో ఎల్బీ అయ్యాడు. ఆంగ్లో మాథ్యూస్ (22) పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో ఎల్బీ అయ్యాడు. ధనుంజయ డిసిల్వా కూడా ఒక్క పరుగుకే అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీ అయ్యాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి పాథుమ్ నిశాంక-26; చరిత్ అసలంక-1పరుగుతో క్రీజులో ఉన్నారు. అశ్విన్ రెండు; జడేజా, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి :రాణించిన రిషభ్: ఇండియా 357/6