Sunday, November 24, 2024
Homeసినిమాతెలుగులో డబ్బింగ్ నేనే చెప్పా : సూర్య

తెలుగులో డబ్బింగ్ నేనే చెప్పా : సూర్య

Suriya-ET: త‌మిళ హీరో సూర్య న‌టించిన తాజా చిత్రం ఈ.టి (ఎవరికీ తలవంచడు). ఈ చిత్రానికి పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సన్ పిక్చర్స్ పతాకం పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ  ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్ ను విడుదల చేస్తోంది. తమిళ వెర్షన్ తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఒకేసారి ఈ నెల 10న‌ విడుదల కానుంది.

ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ “ఈ.టి.లో కోర్ పాయింట్ సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అంశాలే. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుతో పాటు దేశంలో ఎక్కడివారైనా కనెక్ట్ అవుతారు. ప్రతి గ్రామంలోనూ జరుగుతున్న సంఘటనలే. వాటిని దర్శకుడు ఎలా డీల్ చేశాడనేది సినిమా. మన ఇంటికి బంధువులు వస్తే.. అమ్మాయితో మంచి నీళ్ళు ఇప్పిస్తుంటాం. అబ్బాయి ఇవ్వడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇందులో చర్చించాం. ఎక్కడా అసందర్భ సన్నివేశాలు వుండవు. అదే విధంగా భార్యా భర్తల మధ్య చిన్న విషయాలు వస్తే సర్దుకుపోవాలని భార్యకు చెబుతారు. ఇలాంటివి దర్శకుడు బాగా చూపించాడు.

నేను తెలుగు డబ్బింగ్ చెప్పాను. అది యాసలో వుంటుంది. తమిళంలో కూడా ఇలా వుంటే వెరైటీగా వుంటుందని దర్శకుడు చెప్పారు. చిన్న చిన్న డైలాగ్ లు చిన్న చిన్న మార్పులు చేశాం. కొత్త సినిమాలు చేస్తున్నాను. దర్శకుడు బాలతో ఓ సినిమా చేస్తున్నాను. వెట్రిమారన్ తో `వాడి వాసల్` సినిమా చేయాలి. అందులో ప్రతి షాట్ కు కనీసం 500 మంది ఆర్టిస్టులు వుండాలి. అందుకే  కరోనా టైంలో అది సాధ్యపడలేదు. జూన్ లో ప్రారంభించాలనుకుంటున్నాం” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్