TATA IPL-2022: ఐపీఎల్ -2022 షెడ్యూల్ ను నేడు బిసిసిఐ విడుదల చేసింది. చెన్నై సూపర్ కింగ్స్-కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఆరంభ మ్యాచ్ ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మార్చి 26న జరుగుతుంది. మొత్తం 65 రోజులపాటు జరిగే ఈ టోర్నీలో 70 లీగ్ మ్యాచ్ లు, నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్ లతో పాటు ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. బిసిసిఐ కార్యదర్శి జై షా ఈ వివరాలను ఓ ప్రకటనలో తెలియజేశారు.
ఐపీఎల్ షెడ్యూల్ విశేషాలు:
మొదటి రోజు (మర్చి 26) ఒకే మ్యాచ్ ఉంటుంది
మార్చి 27న రెండు మ్యాచ్ లు జరుగుతాయి ఢిల్లీ కాపిటల్స్- ముంబై ఇండియన్స్(బ్రాబౌర్న్ స్టేడియం); పంజాబ్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ (డీవై పాటిల్ స్టేడియం)
మొత్తం12 రోజుల్లో రెండు మ్యాచ్ ల చొప్పున జరుగుతాయి
వాంఖేడే, డీవై పాటిల్ స్టేడియంలో 20 మ్యాచ్ ల చొప్పున; బ్రాబౌర్న్ స్టేడియం, పూణే ఎంసిఏ స్టేడియాల్లో 15 మ్యాచ్ ల చొప్పున జరుగుతాయి
లీగ్ మ్యాచ్ లలో చివరిది సన్ రైజర్స్ హైదరాబాద్ – పంజాబ్ కింగ్స్ మధ్య మే, 22న జరగనుంది
ప్లే ఆఫ్ మ్యాచ్ లు, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్, వేదికలను బిసిసిఐ త్వరలో ప్రకటించనుంది :
Also Read : మార్చి 26 నుంచి ఐపీఎల్ షురూ