Friday, May 31, 2024
Homeస్పోర్ట్స్టాటా ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

టాటా ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

TATA IPL-2022: ఐపీఎల్ -2022 షెడ్యూల్ ను నేడు బిసిసిఐ విడుదల చేసింది. చెన్నై సూపర్ కింగ్స్-కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఆరంభ మ్యాచ్ ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మార్చి 26న జరుగుతుంది. మొత్తం 65 రోజులపాటు జరిగే ఈ టోర్నీలో 70 లీగ్ మ్యాచ్ లు, నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్ లతో పాటు ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. బిసిసిఐ కార్యదర్శి జై షా ఈ వివరాలను ఓ ప్రకటనలో తెలియజేశారు.

ఐపీఎల్ షెడ్యూల్ విశేషాలు:

మొదటి రోజు (మర్చి 26) ఒకే మ్యాచ్ ఉంటుంది

మార్చి 27న రెండు మ్యాచ్ లు జరుగుతాయి ఢిల్లీ కాపిటల్స్- ముంబై ఇండియన్స్(బ్రాబౌర్న్ స్టేడియం); పంజాబ్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ (డీవై పాటిల్ స్టేడియం)

మొత్తం12 రోజుల్లో రెండు మ్యాచ్ ల చొప్పున జరుగుతాయి

వాంఖేడే, డీవై పాటిల్ స్టేడియంలో 20 మ్యాచ్ ల చొప్పున; బ్రాబౌర్న్ స్టేడియం, పూణే  ఎంసిఏ స్టేడియాల్లో 15 మ్యాచ్ ల చొప్పున జరుగుతాయి

లీగ్ మ్యాచ్ లలో చివరిది సన్ రైజర్స్ హైదరాబాద్ – పంజాబ్ కింగ్స్ మధ్య మే, 22న జరగనుంది

ప్లే ఆఫ్ మ్యాచ్ లు, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్, వేదికలను బిసిసిఐ త్వరలో ప్రకటించనుంది :

Also Read :  మార్చి 26 నుంచి  ఐపీఎల్ షురూ

RELATED ARTICLES

Most Popular

న్యూస్