ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ కమలం వికసిస్తోంది. అక్కడ మరోసారి అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కమలానికి సవాల్ విసురుతుంది అనుకున్న కాంగ్రెస్ మణిపూర్ లో చతికిల పడింది. 60 శాసనసభ స్థానాల్లో పోటీ చేసిన బిజెపి జయకేతనం ఎగురవేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకే పట్టం కట్టే అలవాటు ఉన్న మణిపూర్ వాసులు అదే ధోరణి కనబరిచారు. మహిళా ఓటర్లు అధికంగా ఉన్న ఈ రాష్టంలో బిజెపికి బంపర్ మెజారిటీ ఇచ్చారు. మణిపూర్ ప్రోగ్రేసివ్ సెక్యులర్ అలయన్స్ పేరుతో కాంగ్రెస్ కూటమి ఏర్పాటు చేసినా బిజెపిని నిలువరించ లేకపోయింది. కూటమిలో సిపిఎం, సిపిఐ, జనతాదళ్ (సెక్యులర్),ఫార్వర్డ్ బ్లాక్, రెవెల్యుష్యునరీ సోషల్ పార్టీ (ఆర్.ఎస్.పి.) కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి.
మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ హింగాంగ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిని బీరేన్ ఓడించారు. మణిపూర్‌లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ లు కూడా వివిధ ప్రాంతాల్లో తమ ఆధిక్యం చాటుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు గానే కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి సీఎం బీరెన్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది.
మణిపూర్ లో మొత్తం సీట్లు – 60 బిజెపి – 32, కాంగ్రెస్ –05,ఎన్.పి.ఎఫ్ –05, ఎన్.పి.పి.-07, JD(U)-06 ఇతరులు –05
ఇవి కూడా చదవండి: ఉత్తరఖండ్ లో బిజెపి ప్రభంజనం