Sunday, February 23, 2025
Homeసినిమారాధేశ్యామ్ ఆల్ టైమ్ రికార్డ్

రాధేశ్యామ్ ఆల్ టైమ్ రికార్డ్

Radhe Records:  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ హీరోయిన్ పూజాహెగ్డే జంట‌గా న‌టించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బాహుబ‌లి, సాహో చిత్రాల త‌ర్వాత ప్ర‌భాస్ నుంచి వ‌స్తోన్న సినిమా కావ‌డంతో రాధేశ్యామ్ పై అటు అభిమానుల్లోను ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీనికి తోడు టీజ‌ర్ అండ్ర ట్రైల‌ర్ కు ట్ర‌మెండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో మూవీ పై అంచ‌నాలు రోజురోజుకు బాగా పెరిగాయి.

యువీ క్రియేష‌న్స్, గోపీకృష్ణా మూవీస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించాయి. ఈ సినిమా ఎలా ఉండ‌బోతుంది..?  ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయ‌బోతుంది..? అనేది సినీవ‌ర్గాల్లో ఆస‌క్తిగా మారింది. ఈ మూవీ ఈరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్‌కి ముందే నైజాంలో ఆల్‌టైమ్ రికార్డ్ సెట్ చేసింది. హైదరాబాద్‌లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 6.5 కోట్ల మార్క్ దాటింది. ఇది డే1 ఆల్‌టైమ్ రికార్డ్ అని చెప్పాలి.

అలాగే యుఎస్ లో ప్రీమియ‌ర్ షో ద్వారా దాదాపుగా 1 మిలియ‌న్ మార్క్ కి చేరుకుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లో కూడా రాధేశ్యామ్ కి భారీ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ఇలా అన్ని ఏరియాల్లో రాధేశ్యామ్ రికార్డులు క్రియేట్ చేస్తుండ‌డం విశేషం. రిలీజ్‌కి ముందే రాధేశ్యామ్ ఇలా రికార్డులు సాధిస్తుందంటే, రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులను నెలకొల్పుతుందో అనేది ఆస‌క్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్