Annay: మెగాస్టార్ చిరంజీవి, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించనున్నారని.. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించనుందని టాక్ బలంగా వినిపించింది. మెగా అభిమానులు ఈ మూవీ గురించి అప్ డేట్స్ వస్తాయని ఎదురు చూశారు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.
ఇంతకీ ఏం జరిగిందని ఆరా తీస్తే.. ఈ మూవీ స్టోరీ లైన్ చెప్పగానే అల్లు అరవింద్ బాగా ఇంప్రెస్ అయ్యారట. వెంటనే ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయ్ మని శ్రీకాంత్ అడ్డాలకు చెప్పారట. అయితే.. శ్రీకాంత్ అడ్డాల ఈ మూవీ కంటే ముందుగా ఓ చిన్న సినిమా చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఓ యంగ్ హీరోతో మూవీ చేయడం కోసం కథ రెడీ చేస్తున్నారట. ఇది కంప్లీట్ అయిన తర్వాత చిరు, బన్నీ కోసం కథ రాస్తానని చెప్పారట.
చిరు, బన్నీ కోసం అనుకున్న కథకి ‘అన్నాయ్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారని.. ఈ స్టోరీ చాలా కొత్తగా.. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు. అందుకనే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలి అనుకుంటున్నారట. మరి.. అల్లు అరవింద్ కి అంతగా నచ్చిన అన్నాయ్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.