Lakshya Sen: జర్మన్ ఓపెన్ 2022 లో లక్ష్య సేన్ సెమీ ఫైనల్లో ప్రవేశించాడు. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో లక్ష్య సేన్ మన దేశానికే చెందిన హెచ్.ఎస్. ప్రన్నోయ్ పై 21-15; 21-16 తేడాతో విజయం సాధించాడు. మరో మ్యాచ్ లో కిడాంబి శ్రీకాంత్ వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు విక్టర్ ఆక్సెల్సేన్ చేతిలో 21-10; 23-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఆట మొదటి సెట్ లో విక్టర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. రెండో సెట్ లో శ్రీకాంత్ హోరాహోరీ తలపడ్డాడు గేమ్ చివరి వరకూ సెట్ ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠగా సాగింది. చివరకు విక్టర్ పైచేయి సాధించాడు.
మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగంలో నిరాశే ఎదురైంది. నిన్న మూడోరోజు రెండోరౌండ్ తోనే వారు వెనుదిరిగారు. అయితే పురుషుల విభాగంలో లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్, ప్రన్నోయ్ లు క్వార్టర్స్ కు చేరగా, ఒక మ్యాచ్ మన దేశానికే చెందిన సేన్- ప్రన్నోయ్ ల మధ్యే జరగడం గమనార్హం.
పురుషుల డబుల్స్ విభాగంలో మన ఆటగాళ్ళు గరగ కృష్ణ ప్రసాద్- పంజాల విష్ణు వర్ధన్ గౌడ్ జోడీ.. చైనా ఆటగాళ్ళు హే జి టింగ్- జో హావో డంగ్ చేతిలో 21-11; 23-21 ఓడిపోయారు.
జర్మన్ ఓపెన్ లో ఇండియా ఆశలన్నీ లక్ష్య సేన్ పైనే ఉన్నాయి.