Sunday, February 23, 2025
Homeసినిమాప్ర‌భాస్ రాధేశ్యామ్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంత‌.?

ప్ర‌భాస్ రాధేశ్యామ్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంత‌.?

Record Gross: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన భారీ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు యువి క్రియేష‌న్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా.. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. క‌రోనా కార‌ణంగా చాలా సార్లు వాయిదా ప‌డిన రాధేశ్యామ్ మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

అయితే… ఫ‌స్డ్ డే ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ.. రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేయ‌డం విశేషం. ఇంత‌కీ ఎంత క‌లెక్ట్ చేసిందంటే.. ఈ కరోనా ప్యాండమిక్ అనంతరం భారీ స్థాయిలో మొదటి రోజు 79 కోట్ల గ్రాస్ ని అందుకున్న సినిమాగా రాధే శ్యామ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అఫిసియ ల్ గా అనౌన్స్ చేశారు. దీంతో ఫ‌స్ట్ వీకెండ్ ఎంత క‌లెక్ట్ చేస్తుంది అనేది ఆస‌క్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్