Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఇండియా 252 ఆలౌట్, లంక 86/6

ఇండియా 252 ఆలౌట్, లంక 86/6

India Vs. SL: ఇండియా- శ్రీలంక మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో మొదటి రోజే 16 వికెట్లు పడ్డాయి. బెంగుళూరులోని చిన్న స్వామి స్టేడియంలో మొదలైన ఈ డే నైట్ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టులో జయంత్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్ ను తీసుకున్నారు. మయాంక్ అగర్వాల్ (4); రోహిత్ శర్మ(15) లు స్వల్ప స్కోరుకే ఔటయ్యారు. కోహ్లీ 23 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ మరోసారి సత్తా (92) చాటాడు. 8 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయ్యర్ తో పాటు రిషభ్ పంత్ (39), హనుమ విహారీ (31) మాత్రమే రాణించారు. లంక బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 59.1 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఎంబుల్దేనియా, జయ విక్రమ చెరో మూడు; ధనుంజయ డిసిల్వా రెండు; లక్మల్ ఒక వికెట్ పడగొట్టారు.

తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన శ్రీలంక కూడా వరుస వికెట్లు కోల్పోయింది. బుమ్రా, షమీ రాణించారు. లంక జట్టులో అంగోలా మాథ్యూస్ ఒక్కడే 43 పరుగులతో అత్యధిక స్కోర్ చేశాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. బుమ్రా మూడు; షమీ రెండు, అక్షర్ ఒక వికెట్ పడగొట్టారు.

రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇండియా 1-0 ఆధిక్యంతో ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్